గురువులు క్రీస్తును పోలి జీవించాలి - పోప్
జోసెఫ్ అవినాష్
02 Apr 2026
వాటికన్ వేదికగా, విశ్వ కాపరి పోప్ లియో XIV ఆధ్వర్యంలో
పవిత్ర క్రిస్మ్ తైలాల దివ్యబలిపూజ జరిగింది.పోప్ ప్రత్యకించి శ్రీసభ గురువులకు తన సందేశాన్ని అందించారు.ఆయన మాట్లాడుతూ,మనం క్రైస్తవులమంటే మాటలకు మాత్రమే కాదు,మన జీవితం ద్వారా యేసు ప్రేమను చూపించే బాధ్యత కూడా ఉందని. ఈ ప్రపంచంలో ఎక్కడ కలహాలు, సమస్యలు, బాధలు ఉన్నాయో అక్కడ మనం శాంతి తీసుకెళ్లాలి.మనలో ఉన్న అహంకారం,కోపం,మనసులో పెట్టుకునే చిన్న విషయాలన్నీ వదిలేయాలి;ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది ఇతరులకు ధైర్యం ఇచ్చేలా,ఆదరించేలా,ఆశ కలిగించేలా జీవించమని.కొన్నిసార్లు మన మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు,కొన్నిసార్లు మన మీద విమర్శలు పడతాయి అయినా మనం మంచితనాన్ని వదులుకోకూడదు.చీకటి ఉన్న చోట దీపంలా,బాధ ఉన్న చోట ఓదార్పుగా,ఏడుపు ఉన్న చోట ఆశగా ఉండి,క్రీస్తు సువాసనను మన జీవితంతో చూపించాలి అని ఆయన అందరికి గుర్తుచేశారు.
