గురువు దేవుని బహుమతి(పవిత్ర గురువారం సందర్భంగా)

ఆకుల రత్న కుమారి
01 Apr 2026
"గురువు దేవుని బహుమతి" అని అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.స్వయంగా క్రీస్తుప్రభువే కడరాత్రి భోజన సమయాన ఈ గురుత్వాన్ని స్థాపించి మనకు కాపరిని ప్రసాదించారు.
మన కాపరి అయిన ఈ గురువు ఆవశ్యకత మన జీవితాలలో పుట్టుట దగ్గర మొదలుకొని గిట్టుట వరకు కేంద్రీకృతమై ఉంది. మరి అంతటి మహోన్నత స్థానాన్ని స్వంతము చేసుకున్న మన ప్రియతమ గురువులు ఈ విధంగా ఉంటే ఇంకా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని మా ఆశ
1. వాక్యాన్ని ధైర్యంగా ఎటువంటి సందేహం లేకుండా అర్థవంతంగా బోధించే నైపుణ్యత గురువుకు వుండాలి. ఎందుకంటే మన కథోలికులే వాక్యం లేదనో సరిగా అర్ధం కాలేదనో నేడు అనేకమంది ఇతర సంఘాలకు వెళుతున్న సంగతి మనకు విధితమే కదా!
2. స్వచ్ఛమైన ప్రేమ పలకరింపు,ఆదరణ గురువుకు చాలా అవసరం.విచారణకు మొదటి వ్యక్తి గురువు మరి విచారణలలో గల ప్రజలకు అన్ని మంచి పరిస్థితులే ఉండాలని లేదుకదా. రకరకాలైన మనస్థత్వాలు గలవారు వుంటారు.వారికి తగిన విధంగా ఒక పలకరింపు చాలు.
3. 'గురువు' ఉన్నతులకు పరిమితం కాకూడదు.గురువు విచారణలో ఉన్న ప్రతీఒక్కరి సొత్తు కనుక అందరిని సమదృష్టితో చూచి నడిపించాలి.
4.. నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లుగా కాకుండా, అప్పుడప్పుడు విచారణ ప్రజల ప్రేరణలను సలహాలను గౌరవించేటట్లు ఉండాలి.
5. భక్తి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.కొత్త ప్రణాళికలు రూపొందించాలి.
