గురువు సాక్షాత్తు 'క్రీస్తే' (పవిత్ర గురువారం సందర్భంగా)

సిస్టర్ లలిత
01 Apr 2026
1. దైవ మందనములో ప్రభువును భద్రపరచేది గురువే
2.జ్ఞానస్నానం ద్వార నీ ఆత్మను దేవునికి అర్పించేది గురుచే
3. క్రైస్తవ జీవనయాత్రలో నిన్ను బలపరచేది గురువే
4. పాపంలో వున్నప్పుడు క్షమను యిచ్చి రక్షించేది గురువే
5.. మరణ గడియలో నిన్ను యేసు దివ్యరక్తంతో కడిగి శుద్ధి చేసేది గురువే
6. వివాహ సంస్కరణాన్ని విశదపరిచేది గురువే
7. కష్టంలో వున్న వారికి సాయపడేది గురువే
8. సాక్షాత్తు క్రీస్తే ఈ గురుత్వాన్ని స్థాపించి దానిలోని గొప్పతనాన్ని మనకు తేటతెల్లం చేశాడు.నిత్య గురువుగా మిగిలిపోయాడు.
గురువు పట్ల మన బాధ్యత:
1. గురువు కొరకు అను నిత్యం ప్రార్ధన చేయాలి.
2. గురు పోషణకు మన వంతు సాయపడాలి
3. గురువును గౌరవ మర్యాదలతో సత్కరించాలి.
4. బైబిల్లో చెప్పినట్లు నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడని చెప్పిన దేవుని వాక్కు పాటిస్తూ శావగ్రస్తులమువుకుండా కాపాడుకోవాలి.
5. వారు చేసే పరిచర్యలో మన వంతు సహకారం అందించాలి.
గురు అంతస్టు అతి పవిత్రమైనది. ఈ అంతస్థులో అడుగిడుతున్న గురు సోదరులు యేసు క్రీస్తులో శుద్ధులుగా వుంటు, అందరిని ఒకేలా చూస్తు పేదల అభాగ్యుల పట్ల కరుణ,జాలి కలిగి వుండాలని వారి జీవితాల ద్వార ఎన్నో మోడుబారిన జీవితాలలో అశా అనే జ్యోతిని వెలిగించాలని, దైవ మందసం వైపు వారిని నడిపించాలని ప్రతి ఒక్కరికి ఒక సోదరుడుగ మెలగాలని ఈ లోకపు పోకడలకు తావిచ్చి, లోకానికి, ఈలోక వ్యామోహాలకు బలై,గురుత్వ భాధ్యతలను మరువకుండా మార్గదర్శకంగా వుండాలని,నిస్వార్ధ పూరిత సేవ చేయాలని,వాక్యపరిచర్య ద్వారా చితికిన ఎన్నో హృదయాలకు ఊరట నివ్వాలని నా ఆశ నా దృష్టిలో గురువు "సాక్షాత్తు క్రీస్తే" ప్రపంచ నలుమూలల తమ జీవితాలను శ్రీసభ కోసం త్యాగం చేసిన గురువులకు నా శుభాభివందనములు.
