పోప్ లియో XIV నేతృత్వంలో గుడ్ ఫ్రైడే సిలువ మార్గం
జోసెఫ్ అవినాష్
01 Apr 2026
ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే సందర్భంగా రోమ్‌లోని చారిత్రక కోలీసియం వద్ద జరిగే సిలువ మార్గ ధ్యానానికి పోప్ లియో XIV స్వయంగా నాయకత్వం వహించబోతున్నారు.పోప్‌గా ఎన్నుకోబడిన తర్వాత ఆయన జరుపుకుంటున్న తొలి పవిత్ర వారం ఇది.అందుకే యేసు గోల్గొత్తాకు వెళ్లిన బాధామార్గాన్ని గుర్తుచేస్తూ,ప్రతి స్థలం వద్ద ఆగి,తన చేతులతోనే సిలువను మోస్తూ,క్రీస్తు త్యాగాన్ని మన హృదయాల్లో మళ్లీ జీవం పోయాలని ఆయన కోరుతున్నారు.ఈ సంవత్సరానికి సంబంధించిన సిలువ మార్గ ధ్యానాంశాలను క్రీస్తు పాద స్పర్శతో పునీతమైన పవిత్ర భూమిలో ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన ఫ్రాన్సిస్కన్ ఫాదర్ ఫ్రాన్సెస్కో పాట్టన్ సిద్ధం చేశారు.గుడ్ ఫ్రైడే ఉదయం ఈ ధ్యానాంశాలు అధికారికంగా విడుదల అవుతాయి.భక్తి వాతావరణంలో జరగనున్న ఈ సిలువ మార్గం మొత్తం,మన జీవితాల్లోనూ బాధల మధ్య క్రీస్తుతో కలిసి నడవడం ఎంత ముఖ్యమో మనకు లోతుగా తెలియజేయునుంది.
