కూరిమి యెపుడైన కుఱచ యౌన?.

డా. కల్లూరి ఆనందరావు
31 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
అక్కరున్న నాడు ఆదరమ్ముగ బిల్చి!
పనులు లేని నాడు ప్రక్క నుంచు
ద్వంద్వ వైఖరున్న దరికి చేరరెవరు!
కూరిమి యెపుడైన కుఱచ యౌన?.
