ఏప్రిల్ మాస ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
31 Mar 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV ఏప్రిల్ నెలలో విశ్వ శ్రీసభ ప్రార్థించాల్సిన ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించారు.కష్టకాలంలో ఉన్న గురువుల (ఫాదర్లు) కోసం మనమంతా కలిసి దేవుని ప్రార్థించాలని ఆయన కోరారు.కొంతమంది గురువులు ఒంటరితనం,అలసట,సందేహాలు లేదా తమ పిలుపు గురించి గందరగోళం వంటి పరిస్థితులను ఎదుర్కొంటారు.అలాంటి సమయంలో వారు విరిగిపోకుండా,ధైర్యంగా ఉండేందుకు మనం వారి కోసం ప్రార్థించడం చాలా అవసరమని పోప్ అన్నారు.వారి సేవ పట్ల మళ్లీ ఆనందం కలగాలి,దేవుని పిలుపు పట్ల ఉత్సాహం పెరగాలి,మరియు అవసరమైన ఆత్మీయ మద్దతు వారికి అందాలి. గురువులు కూడా మనలాంటి మనుషులే వారు కూడా సహాయం,అర్థం చేసుకోవడం,ప్రేమ,తోడ్పాటు కోరుకుంటారు.అందుకే ఈ నెలలో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి,బాధలు తగ్గి,దేవుని శాంతి మరియు బలం వారి జీవితంలో నింపబడాలని మనమందరం కలిసి ప్రార్థించాలని పోప్ విశ్వ శ్రీసభను ఆదేశించారు.
