పశ్చతాపం వెలుగు వైపు నడిపించెను
బ్రదర్ టోనీ నాగిపోగు MSC
31 Mar 2026
తపస్కాలపు ముప్పై ఆరవ రోజు
మొదటిపఠనము :యెషయా: 49:1-6
సువిశేషపఠనము : యోహాను :13:21-33, 36-38
ప్రియులారా దేవుని పిలుపు మనకు ఎంతో విలువైనది. ఆయన రాజ్యములో మనలను బలముగా వాడుకొనుటకు మనలను ఎన్నుకుంటాడని, ఆయన శక్తివంతమైన వాక్యము మనలో ఉంచి ఎన్నో హృదయాలు తాకేల మరల్చుతాడని, అతని సందేశం విస్తరణ గావించాలని, జాతులకు వెలుగుగా చేస్తాడని, యెసయా ప్రవక్త యేసుక్రీస్తు వారి సేవను ముందుగానే సూచిస్తున్నాడు. లోకానికి రక్షకుడు, ఒక లక్ష్యం తన స్వంతం అని, గొప్పకార్యాల మహోన్నత్తుడు అని, మనకు తెలియజేస్తున్నాడు...... ఆ సేవను ఆ పిలుపును గుర్తించని శిస్యులు ఒకరు అమ్ముతున్నారు, మరొకరు బొంకుతున్నారు.
1) ద్రోహి ఎవరో ప్రకటింపబడుతుంది (21-38)
యూదా ఎవరికి తెలియదు లె అనుకున్నాడు. ఆయన సేవలో బిజీ అయ్యాడు, తోటి వారు వారిపనిలో వారు లీనమాయ్యారు, నేను చేసిందే శాసనం, చెప్పినదే ఆజ్ఞ అన్నట్టు గా, చెడు బుద్ధితో వున్నా యూదా ను నీవు నన్ను అప్పగిస్తావని అన్నప్పుడు, గుండెలో గుండె లేదు యూదకు,... మనము కూడా చేసే తప్పు ఎవరికి తెల్వదు లె, ఏమి కాదులే అని నిర్ణయించుకుంటే, దేవుడు మన పాపాలను యూదా పాపం వలె బట్టబయలు చేస్తాడు.
2) యేసుక్రీస్తు వారి మహిమ మరియు చివరి వీడ్కోలు(31-33)
యెరూషలేముకు ప్రవేశించింది మరణించుటకొరకే అని ఆయనకు ఎరుక,.. శిష్యులకు తెలియదు. ఆయన మహిమన్వితుడని, చివరి వీడ్కోలు ఇదే నని కూడా వారు గుర్తించలేదు .
3) పేతురు ననిరాకరణ మాటలు (36-38)
పేతురు ఏమి చేయబోతున్నాడో యేసు వారికి తెలుసు, పేతురు ఏమి చేస్తున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో, తెలియదు. అన్ని తెలిసిన ఆయన బొంకుతావు అని అంటుంటే, నీవు వెళ్లే చోటికి నేను వస్తాను అని అంటున్నాడు. అన్నాడేకానీ, ఎక్కడికి అని పూర్తిగా తెల్వని పేతురుగారు
4) ద్రోహం మరియు పాపం
మనుషులు దేవునికి దూరం అయిపోతే ఏమి జరుగుతుంది అంటే, యూదా వలె మూరకముగా సాతాను వలలో పడతారు. పాపం ఎదురుగా వుంటది ఎవరైతే దేవునికి దూరమై వుంటారో, సాతాను వద్దు అనుకుంటే దేవునికి దగ్గర అవ్వాలి అనుకుంటే సాతానును వదిలేయ్, బంధించు, బాధ్యడుడై దేవుని ఆశీర్వాదలను పొందుకొంటారు.
5) యేసుక్రీస్తు వారి జ్ఞానం
అన్నియు ఎరిగిన వాడు, సర్వంతర్యామి.
6) మానవ బలహీనత
దేవున్నినిరాకరించటం మరియు మారాలానే స్వభావం లేకపోవటం.
ప్రభువులవారికి యూదా మరియు పేతురుల బలహీనతల గురించి తెలుసు. వారి ప్రతిజాడ ఎరుకే, కానీ ఎందుకు తన శిస్యులుగా ఏర్పారచుకున్నాడు అంటే, ఆయన మన బలాలను, చూసే వాడు కాదు, ప్రేమించేది, మన బలహీనతనలను చూసి కూడా తన సేవకు పిలుస్తాడు.
యూదా – అప్పగించాడు
పేతురు – బొంకాడు
యూదాలో పశ్చాతాప మనస్సు లేదు, పేతురులో వుంది. యూదాలో మారాలానే స్వభావం లేదు,, యూదాలో మారాలానే స్వభావం లేదు, లోక పిచ్చి, ధనపిచ్చి, పాపపు పిచ్చి, మోసపిచ్చి, యూదా గురి అప్పగింత, యూదా లక్షణం ఎలాగ అయినా ధనాన్ని స్వీకర్రించటం. ప్రబుని శిస్యుడు అయినా సాతాను తో నిoపబడిన సాతాను గాడి సన్నిహితుడు. అంతర్గత సాతాను స్వభావం, బాహ్య నాటక ఆత్మీయ లక్షణం. సమాజం క్రీస్తు కొరకు ఎదురు చూస్తే యూదా ధనం కోసం ఎదురు చూస్తాడు. ముద్దుతో మోసగించాడు, నటనతో అప్పగించ్చాడు. నమ్మిన బంటుల ఉంటు నజారానా కోసం నిజరేయ వాసి క్రీస్తును వారి చేతిలో పెట్టాడు. ధనం కన్నా దైవం మిన్న అని గుర్తించలేకపోయాడు. ధనరాషులు క్రెస్టుకు సాటి కాదని అర్తం చేసుకోలేక పోయాడు. కళ్ళు తెరిస్తే ధనం,తెరిస్తే జనం, మాట ముందు, తరవాత ధనాలోచన, ఆధనం యూదాను నాశనం చేసింది.
పేతురు, బొంకాడు, తప్పని తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు. ముందుకు పరుగేతి ఏడ్చాడు, ఆవేశం వున్నా, ఆత్మీయుడు. మారలానే స్వభావం చాలా ఎక్కువ. పా శ్చ్చాతాప హృదయుడు మన పేతురు గారు. చేసిన తప్పు చేయను అని నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ తిరిగి చూడని దృడమైన శిస్యుడు. క్రీస్తు కొరకై మారాడు, పయనించాడు, ప్రకటించాడు, బోధించాడు శిస్యులకు నాయకుడాయ్యడు, శ్రీసభ తొలి జగద్గురువులు అయ్యారు. ప్రియ జానాంగమా మరి నీవు నేను మనము ఎక్కడ, యూదా గారి మార్గములోన, పేతురు గారి మార్గములోన, ఆత్మపరిశీలన చేసుకోవాలి.
యూదా బలహీనత బలమై కూర్చుంది. పేతురుగారి బలహీనత క్షీనించి, నశించి, భూమిలో కలిసిపోయింది. కావున మన బలహీనతలు బలం కాకూడదు మన క్రీస్తు ప్రేమ బలమై, కూర్చోవాలి. కావున బలహీనతలో బలం కాకా, క్రీస్తులో పేతురు గారి వలె బలముగా మారాలని ప్రార్తించుకుందాం.
