శాంతి రాజైన క్రీస్తు మార్గమే మన మార్గం - పోప్
జోసెఫ్ అవినాష్
29 Mar 2026
పవిత్ర వారానికి ఆరంభమైన మానికొమ్మల ఆదివారం సందర్భంగా పోప్ లియో XIV రోమ్‌లో దివ్యబలిపూజను అర్పిస్తూ,ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.యేసురాజు అయినా,ఆయన రాజ్యం హింసతో కాదు ప్రేమతో,వినయంతో నడుస్తుంది అని గుర్తు చేశారు.బాధలు,అన్యాయం ఎదురైనా యేసు ప్రతీకారం తీసుకోకుండా సిలువ దారి ఎంచుకున్నాడు; అదే నిజమైన శాంతి మార్గమని చెప్పారు.ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు,హింసల వల్ల మానవత్వం గాయపడుతోందని ఆయన బాధ వ్యక్తం చేశారు.చేతుల్లో ఆయుధాలు పట్టుకుని దేవుని ప్రార్థించడం వ్యర్థమని, ముందుగా మన హృదయాలను మార్చుకుని శాంతిని ఆచరించాలని పిలుపునిచ్చారు.చివరగా,సిలువ వద్ద నిలిచిన మరియమ్మలా మనం కూడా బాధలో ఉన్నవారితో నిలబడి, ప్రపంచానికి శాంతి,ప్రేమ తీసుకురావాలని ఆయన మనలను ఆహ్వానించారు.
