దేవుని దీవెనలు నిండుగా పొందుకుందాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

29 Mar 2026

తపస్కాలపు ముప్పై ఐదవ రోజు
మొదటిపఠనము : యెసయా: 42:1-7
సువిశేషపఠనము : యోహాను : 12:1-11
ప్రియులారా ప్రభువు తనసేవకునిపై ఆత్మను కుమ్మరిస్తాడు. జనములకు న్యాయాధిపతిగా నియమిస్తాడు. వినమ్రతతో కూడిన న్యాయకత్వపు లక్షణాలను అనుగ్రహిస్తాడు. దేవునిచ్చే ఎన్నుకోబడ్డానులె అని గొడవలకు, తగాధాలకు మరియు మసకబారిన వతేనా ఆర్పే క్రియలకు వెళ్ళకూడదు. అతని నుండి కరుణ, దయ మరియు కనికరాలు మాత్రమే ప్రవహిస్తాయి. న్యాయస్తాపనకు ప్రముఖునిగా దేవుని పిలుపుకు కట్టుబడిన వాడిగా, విమోచనను కలిగించే సేవకునిగా, చీకటి నుండి వెలుగులోనికి తీసుకునిరావటం, దేవుని ప్రియ సేవకుని ముఖ్య, ప్రాముఖ్య లక్షణాలను మొదటి పఠనపు ప్రబుని సేవకుని గూర్చిన గీతము, ఆత్యాత్మిక సందేశము, మరియు మనము ద్యానించుకోవాల్సిన ఆత్మీయతను అందిస్తుంది. దేవుడు మిక్కిలిగా తను ఎన్నుకున్న సేవకుని నుంచి, నీ, నా, మన నుంచి ప్రేమ, న్యాయం, శాంతి, వెలుగు, విమోచన, మంచితనం, కరుణ, జాలి, కనికరం, మేలేరిగినతనం, నమ్మదగినతనం, విశ్వాసం, ఐక్యత, శాంతి హృదయం, ఆహ్లాధమనస్సు, పరిపూర్ణభక్తి, మలినంలేని ఆత్మాబీమానం, పేదలపై ప్రత్యేక ద్రుష్టి, ఏమి లేనివారిపై ప్రత్యేకశ్రద్ధ, కావాలసిన వారిపై, కాస్తంత పట్టింపు, ఈ విధముగా ప్రభువు ప్రతి ఒక్కరి నుండి ఆశీస్తాడే కానీ గర్వమును కాదు అహంకారమును కాదు. ఇతరులను నాశనం చేయటం, వేరే వాళ్ళ జీవితాలను అంతం చేయాలనీ కోరితే, ఊరికవుందే దేవుడు కాదు మన దేవుడు.

మన క్రైస్తవ భక్తిలో, దృష్టిలో, నిజమైన దైవ కుమారుడే, దైవసేవకుడు మరెవరో కాదు, మన యేసుక్రీస్తు వారు. ఆయన వినమ్రత, ప్రేమ, కరుణ, న్యాయం, శాంతి సమాధానాలు, ప్రభువుల వారు లోకానికి తీసుకుని వచ్చారు. వెదజల్లారు, బీజాలు వేశారు, మొలిచ్చాయి, మోలుస్తున్నాయి. ప్రియులారా దేవునిపై ప్రేమను ఎలా అయినా మనము చూపించాలి అంటే చూపించవచ్చు. ఎప్పుడు అయిన, ఎలా అయినా,.........
A) మరియ:- (12:3)....నిజమయిన ప్రేమకు అంకితమయినా అమూల్య జీవితముకు సాక్షం.
B) యూదా ఇస్కారియొతూ :-( 12:4,5) బాహ్యముగా మంచిగా కనిపించిన లోపల స్వార్తముతో, డబ్బు పిచ్చితో, మలినమయినా మసకగల హృదయముతో నిండి, పొంగిపోర్లే స్వభావము.
C) యేసుక్రీస్తు వారు :- త్యాగానికి సిద్ధం అయినా, ప్రవచించిన ప్రవచం, త్యాగామాయు, బాధామయ సేవకుడు, ఈయనే, అన్నింటిని, అన్నివిధాలుగా నీ కోసం నాకోసం, త్యాగానికి సంసిద్ధం అయినా త్యాగామయి కరుణామూర్తి, దయ సంపన్నుడు.
D) లాజరు:- (12:9)....దేవుని మహిమకు సాక్షం. సన్నిహితుడు. స్వస్థతపరుడు. యేసుక్రీస్తు వారి స్నేహపూర్వికమయినా బావం. స్నేహషీలి, స్నేహమయిని..
E) కావున మనము మన విశ్వాసము, భక్తినామాలు, ప్రేమతో ఉన్నాయా, స్వార్తంతో ఉన్నాయా.... కఠినముగా ఉన్నాయా లేక యూదావాలె నటిస్తున్నాయా... బాధామయ దేవుని సేవకునివలె దేవునికీ ప్రియముగా వున్నాయా, మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి. మనము కూడా ప్రభువు వారివాలె, ప్రతి విషయమునాకై, దేవుని కొరకు సంశీదపడదాము. అది ప్రాణం, ధన, బిజినెస్, పర్సనల్ ఏదైనా అవని మనము కూడా రాబోయే క్రీస్తు పాటుల శ్రమలకు సంసిదమవుదాం. రాబోయ్యే క్రీస్తు ప్రభువుల పాటులలో పాలుపంచుకుందాము, ఆయన భాగ్యవరములను కుటుంబం నిండా పొందుకుందాము.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN