మ్రానికొమ్మల ఆదివార ప్రత్యేకం

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

28 Mar 2026

జెరుసలేము పురములో జరిగెనొక సంబరము
ఊరేగుతూ జనులంతా మరియ సుతుని కొలిచారు
గార్దభాన్ని ఎక్కించి ఊరంతా త్రిప్పారు
మద్దెలలు మోగించి హోసన్నాలు చెప్పారు
దారంతా వస్త్రాలు వరుసగా పరిచారు
దావీదు కొమరుడని కోరి నడవ మన్నారు
మ్రాను కొమ్మలూ పట్టి జే జే లను పలికారు
మా రాజువు నువ్వంటూ మన్ననలే చేశారు!

ఎంత సంతసించాడో నాడు మరి నా తండ్రి !
ఇంత ప్రేమ నాపై ఈ జనులకని మురిశాడో
అన్ని సన్నుతులనెంత అబ్బురాన విన్నాడో
ఎన్ని కరుణ వరములను వారిపై కురిశాడో !

తిరిగి నేడు మరల మనము
ఆరోజును స్మరణ చేసి
మన మనసులనే మ్రాను కొమ్మ లెత్తి పట్టు కొందాము
మనుష్య కుమారుని భక్తితో స్తుతియించి
ఎనలేని దివ్య ప్రేమ వరములను పొందుదాం!!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN