మ్రానికొమ్మల ఆదివారం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

28 Mar 2026

మొదటి పఠనము : పఠనము : యెషయా 50:4-7
రెండవ పఠనము : పిలిప్పు :2:6-11
సువిశేష పఠనము : మత్తయి 21:1-11
ప్రియులారా మ్రానికొమ్మల ఆదివారం క్రీ శ నాలుగవ శతబ్దములో ప్రారంబం అయినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ రోజును యెరూషలేము లోని క్రైస్తవ సమూహలు పాటించేవారు. ముఖ్యముగా ఈ ఉత్సవాన్ని ప్రత్యేకముగా ఎవరు ప్రారంభించారు అన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేవు కానీ యెరూషలేములోని క్రైస్తవులు మొదటగా దీనిని పాటించారు. ఈ పండుగ 8 వ శతబ్దం లో ప్రాచుర్యం పొందింది.

మత్తయి 21:6......17 సార్లు యెరూషలేము నకు వెళ్లిన యేసుప్రభుల వారు, 18 వ సారి, వెళ్తాడు కానీ మరల తిరిగి వచ్చుటకు కాదు, మరణం ముందు ఉందని తెలుసు, మరణాన్ని ఎదురుకోవాలని తెలుసు, మరణం ఎదురు చూస్తుందని తెలుసు, మరణిస్తాడని తెలుసు, అన్ని తెలిసిన ప్రబులవారు, తలదించుకుని వెళ్తున్నాడు. మరణించుటకు వెళ్తున్నాడు, అర్పించుకొనుటకు వెళ్తున్నాడు, అంకితమివ్వటం కోసం వెళ్తున్నాడు, మనలాగా భయముతో వెళ్ళటం లేదు, మనలాగా అదురుతు, బేదురుతు వెళ్ళటం లేదు, ఆనందముగా, అంగీకరించి నీకోసం, నాకోసం మనందరి క్షేమం కోసం బయలుదేరుతున్నాడు. ఏమి నేర్పిస్తుంది, ఈ మ్రానికొమ్మల ఆదివారం, నీకు,నాకు,మనకు, మరియు మనందరికీ, త్యాగాని, ప్రేమను, వినయాన్ని గుర్తుచ్చేసే పవిత్రమైన రోజుగా కనపడుటలేదా? మనకు మరణం అంటే భయం, ఎందుకు అంటే పునరుతాన్ని నమ్మము,... అవునా, నిజామా, మరల తిరిగి లేస్తామా, ఇంతకుముందు ఎవరైనా లేచారా, అనునటువంటి ఆరా, కోరా భక్తి విశ్వాసములతో జీవిస్తున్నాము, కానీ ఈ మ్రానికొమ్మలా ఆదివారం మనకు, మన ఆరా కోర భక్తికి ముగింపు చేసుకుని విజయోస్తవుడైన క్రీస్తు మరణం ద్వారా మనందరికీ నిత్య సజీవమైన రక్షణ జీవితం కలదని ఎంతమందికి తెలుసు దీనిలోని లోతయినా బావం. అందుకే మనకు జెకర్యా 9:9.............సిమోను కుమారి నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము.......... ఈగ్రంధం ఎప్పుడో ప్రవచ్చించింది, ఈ ఆదివార ప్రత్యేకత గురించి, ప్రవక్తలు ఎప్పుడో పలికారు... ఈ మ్రానికొమ్మల ఆదివారం మనకు యేసుక్రీస్తు ప్రబులవారి.................
ప్రేమే శాశ్వతమని సూచిస్తుంది
త్యాగం మంచిదని సూచిస్తుంది
అర్పణం మంచిదని సూచిస్తుంది
రక్షానకొరకేనని సూచిస్తుంది
విజయోస్తవమని సూచిస్తుంది
మారాలని సూచిస్తుంది
స్మరించుకోవాలని సూచిస్తుంది
అర్తం చేసుకోవాలని సూచిస్తుంది
ఆలింగన పరుచుకోవాలని సూచిస్తుంది
దారిచేరాలని సూచిస్తుంది
క్రీస్తే నిజమైన దేవుని కుమారుదని సూచిస్తుంది
మరణం అపజయపాలవుతుంది అని సూచిస్తుంది
రారాజును సూచిస్తుంది
ఆయన గొప్పతనమును సూచిస్తుంది
మాదిరిని సూచిస్తుంది
వినయమును సూచిస్తుంది
విధేయతను సూచిస్తుంది
తగ్గింపుతణమును సూచిస్తుంది
ఆయన వున్నాడని సూచిస్తుంది
పునరుతానం తద్యం అని సూచిస్తుంది
చీకటికి తావు లేదని సూచిస్తుంది
పవిత్రమైనా జీవన విధానమును సూచిస్తుంది
స్తుతించటం సూచిస్తుంది
ఘనపరచటం సూచిస్తుంది
ఆరాదించటం సూచిస్తుంది
ప్రేమించటం సూచిస్తుంది
ఎలుగేతి పొగడటం సూచిస్తుంది
సత్యమును సూచిస్తుంది
వెలుగును సూచిస్తుంది
మంచిని సూచిస్తుంది
గెలుపును సూచిస్తుంది
స్వీకరింపును సూచిస్తుంది.......
కావున ప్రియులారా సంవస్థరాలు వారధిగా వస్తున్నా ఈ మ్రానికొమ్మల ఆదివారం మన జీవితాలలో ప్రత్యేకముగా, ఒక స్థిర నివాసంగా నిలవాలి అంటే పవిత్రమైన అయన నామమును జాపిస్తూ, సిలువ, మరణ, పునరుతనాలలో పాలుపంచుకుంటూ, ఎవరికోసమో, ఎందుకు చనిపోయాడో అని కాకుండా, ఇది కేవలం నా వలెనే ఇలా జరిగింది అని విశ్వాసిస్తూ నిండైనా విశ్వాస పవిత్ర వారం లో ప్రవేశించాలి. దీనిలోని ప్రాముఖ్యమైన ప్రత్యేకతను మనము హృదపూర్వకముగా తెలుసుకోవాలి.......... కొన్ని ప్రత్యేకతలు ఏమిటి అంటే
1. యేసుక్రీస్తు ప్రబులవారు మానవాళి రక్షకుడిగా వచ్చాడని
2. అయన వినయం మరియు దైవరాజ్య బోధన
3. పదకొండు రోజుల తర్వాత జరిగే క్రీస్తు సిలువ వేయడానికి ఇది తొలి అడుగు
4. పరలోక రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న ఆశను ప్రతిభిoస్తుంది అని మనకు అర్తం కావాలి ప్రియులారా.....పట్టుకునే ప్రతి మట్ట కీర్తింపుగాను, పలికే ప్రతి మాట స్తుతించుటకు గాను, పాడే ప్రతి పాట స్తోత్రర్పణకు గాను, నిలవాలి. ఏదో వెళ్ళాము, పాడాము, పాల్గొన్నాము అని గాక, నిండైనా పరీత్యాగా హృదయలతో మనం అలింగన పరుచుకోవాలి, మన దేవుడు స్తుతులకు అర్హుడు, స్తుతి పాత్రుడు, స్తుతింపబడిన వాడు, ఆయనను జీవిత కాలము అంత స్తుతించాలి, ఘనపరచాలి ఆరాధించాలి మరియు కీర్తించాలి. మత్తయి 21:8.......దారి పొడవున పరిచరి అని చదువు తాము...... స్తుతించాలి పెదవులద్వారా, జీవిత విధానం ద్వారా, మన శైలి ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, ప్రతి చోట ప్రతి వేల, ప్రతి మాలపులో జీవిత పొడవున స్తుతించాలి, ఎలాగైనా స్తుతించాలి, దారిపోడవునా మన లను మనము దుస్తువుల వలె పరుస్తూ స్తుతించాలి, మరి మనము ఏ విధముగా స్తుతించు చున్నాము...... అలసటతో ఆరాదిస్తున్నావా, అలసట లేకుండా ఆరాదిస్తున్నావా... అందుకే పెద్దలు అన్నారు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని, స్తుతించు, స్తుతించు నీ జీవితకాలము అంత స్తుతించు, కరములతోనా, గలములతోనా, సంగీత వాయిద్యాములతోనా, మట్టలతోనా, వస్త్రాలేతోనా, దూపాముతోనా, మాటలతోనా, నీ వయస్సుతోనా, నీ క్రియేటివిటీ తోనా, నీవు వున్న స్థితిలోన, నీకు వున్న వాటితోనా, వీటితోనైనా స్తుతించు, ఎలాగైనా స్తుతించు, స్తుతించే మనస్తత్వం నీదైతే, ఆశీర్వాధించే సద్గుణం ఆయనది...... ప్రియులారా ఆయనే నిజాదేవుడని అర్తం కావటం లేదా ఆయనే ప్రవక్తలు పలికిన ప్రవచనామాని తెలియటం లేదా, ఆయనే సర్వలోకాల అధిపతి అని తెలియటం లేదా, ఆయనే లోక వైద్యుదని తెలియటం లేదా.. ఈ మ్రానికోమల ఆదివారం, మనందరి ఆశీర్వాదాల వరలుగా లేదా
రక్షానగా లేదా కవచముగా లేదా, జయముగా లేదా, క్షేమముగా లేదా, ఓదార్పుగా లేదా, మనందరి రారాజు, క్రీస్తు రాజు ఈయనే నని తెలియటం లేదా, విధేయత కు పర్యాయపదముగా కనపడుట లేదా, గాడిద ఏ విధముగా అయితే క్రీస్తుని మోసి, తన జీవితమును ధన్యం చేసుకున్నదో అలానే మనముకూడ క్రీస్తుని గుండెల్లో మోయాలి, ఇప్పుడును ఎప్పుడును మరెప్పుడును, మన జీవితాలకు రారాజుగా, మార్పుగా, బాగ్యముగా, అంగీకరించాలి, అప్పుడే మన ఈ కృపాలామునకు, రక్షణకాలమునకు, అర్ధం పరమార్థం వుంటది ప్రియులారా.. ఈ ఆదివారం రోజున పట్టుకుంటున్న ఈ మట్ట జీవిత కాలం మొత్తం నీ చేతిలో స్తుతులు అర్పించుటకు ఉందా... నీవు దానిని ఉంచుకుంటున్నావా, ఉపయోగించుకుంటున్నావా, వినియోగించుకుంటున్నావా, భద్రపరచుకుంటున్నావా,
అది స్థుతులు మట్ట అని
కీర్తించే మట్ట అని
గణపరిచే మట్ట అని
విన్నవించే మట్ట అని
ఉదేశ్యత్మక మైన మట్ట అని
వినయ మట్ట అని
పరిశుద్ధ మట్ట అని
కృపవరల మట్ట అని గుర్తిస్తున్నావా............

ప్రతి మట్ట స్తుతిస్తుంది
ప్రతి మట్ట ధ్వని స్తుతిస్తుంది
ప్రతి రమ్మ
ప్రతి రంగు
ప్రతి పొడవు
ప్రతి ఆకారం
ప్రతి అణువు స్తుతిస్తుంది
తెలుపుతుంది, విన్నావుస్తుంది, దావీదు కుమార అని అరుస్తుంది, హోసన్నా అని గళం ఎత్తుతుంది, నీ చేతిలోని మట్ట, చేతులు లేని వారిని కూడా ఉతేజపారుస్తుంది ఉతేజం ఇవ్వాలి... ఒక్క ఈరోజుటికే పరిమితం కాకూడదు ప్రతిక్షణం మనం కూడా ఆ మట్టావాలె ఆశీర్వాధాకరముగా రారాజుగా స్తుతించాలి, క్రీస్తుకొరకై చీల్చాబడాలి, నరకబడాలి, వేరుచేయబడాలి, ఎప్పుడు అయితే చీల్చిఁబడతావో నరకబడతావో, వేరుచేయబడతావో అప్పుడే మనం ప్రత్యేకమైన జానముగా గుర్తింప బడగలము. గమనించండి ప్రియులారా మట్ట ఏవిధముగా చెట్టు నుంచి కొమ్మ మాను నుంచి, వేరు చేయబడి, చీల్చాబడి నీళ్ళాల్లో కడగబడి తిరుజలముతో ఆశీర్వాదింపబడి మన చేతులకు వస్తుందో అదే విధముగా మనం కూడా ఈ లోకము నుంచి వేరుచేయబడి, చీలచాబడి, ప్రత్యేకముగా మారుతుమో అప్పుడే మన ఆరాధనకు ఒక మాదిరి ఉంటుంది. ఆలా లేనటువంటి మన జీవితం, ఎంత దూరం వెళ్లిన, ఎన్ని స్లీవ మార్గలు చదివిన, ఎన్ని చోట్ల, తీర్తయార్తలకు వెళ్లిన వ్యర్తం. కావున మనం అందరము కూడా ఆనాడు యెరూషలేము లో ప్రజలు గలమేతి తమ గొంతులతో, కరములేతి మట్ట లతో వస్త్రలను పరిచి తమ వస్తువులతో, శ్రమించి తమ శక్తి సామార్తలతో ఆహ్వానించారో మనము కూడా పాడుతూ, పాడిస్తూ, చాటుతూ, చాటి చెబుతూ, ప్రకటిస్తూ, ప్రకటింపచేయమని చెపుతు, కీర్తిస్తూ, కీర్తించమని బోధిస్తూ,.... సకల మానవాళికి రక్షణ బాగ్యమైన క్రీస్తు స్లీవ మరణ పునరుతనము మన జీవితాలకు ఆశీర్వాదకరముగాను, రక్షణముగాను, నిండైనా వరాలగాను నిలువును గాక ఆమెన్.........

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN