శ్రీసభలో ఉన్న అపోహలను తొలగించిన బెంగళూరు పీఠాధిపతి

జోసెఫ్ అవినాష్
28 Mar 2026
బెంగళూరు అగ్ర పీఠాధిపతి మహా పూజ్య పీటర్ మచాడో ఇటీవల సెమినరీలో జరిగిన వ్యవహారాలు, పీఠాధిపతుల ఎంపిక ప్రక్రియ,అలాగే శ్రీసభ దైవార్చన పద్ధతులతో సంబంధించి వచ్చిన సందేహాలకు స్పష్టత ఇచ్చారు.సెమినరీలోని కొన్ని అంశాలు తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం కావడంతో,వాటిని నిజానిజాలు చెప్పి సమాజంలో అనవసర కలవరానికి తావు లేకుండా చూడాలని ఆయన సూచించారు. పీఠాధిపతులను ఎంచుకునే ప్రక్రియ పూర్తిగా శ్రీసభ గత నియమాల ప్రకారమే జరుగుతుందని,ఇందులో ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ ప్రయత్నాలు లేవని ఆయన వివరించారు. శ్రీ సభలో దైవార్చన అంటే ప్రార్థనా విధానం విషయానికి వస్తే, అది విశ్వవ్యాప్త శ్రీసభలో పాటించే నియమాలకు అనుగుణంగా ఉండాలని,వ్యక్తిగత అభిరుచులు లేదా స్థానిక ఒత్తిళ్లకు లోబడకూడదని స్పష్టం చేశారు.మొత్తం మీద, సంఘంలో ఉన్న గందరగోళాన్ని తగ్గించి,విశ్వాసులు ప్రశాంతంగా,నిజమైన సమాచారంతో ముందుకు సాగేందుకు అగ్ర పీఠాధిపతి ఈ వివరణలను ఇచ్చారు.
