అయన సేవలో హేరాలముగా దీవింపబడుదాము

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

28 Mar 2026

తపస్కాలపు ముప్పై నాలుగవ రోజు
మొదటి పఠనము : యెహెఙ్కేలు 37:21-28
సువిశేష పఠనము : యోహాను : 11: 45-57
యెహేఙ్కేలు 37:27..........నేను వారితో వశింతును. నేను వారికి దేవుడనగుదును.
ప్రియులారా మన దేవుడు మనలను ఇబ్బంది పెట్టె వాడు కాదు, అభయమును ఇచ్చే దేవుడు. ఆపదలో కాపాడే దేవుడు. అన్నివేళలా కాచుకునే దేవుడు. ఆటంకం ఎదురువస్తే అట్టకేలకు విరిచి మనకు సరళమును ప్రసాధించే గొప్ప దేవుడు. అటువంటి దేవుడు ఈరోజుటి పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మనము ఒంటరి వాళ్ళము కాదని, ఆయన మనతో ఆణువణువునా వున్నాడని మనతో మాట్లాడుతున్నాడు.

1) ఏకత్వం(Unity):- దేవుడు తన ప్రజలను తిరిగి ఒకటిగా చేస్తాడని, అందరిని కలుపుతాడని, ఎవరిని పోగొట్టుకోడని, ఎవరిని వదలడని, తన అపారప్రేమను కురిపిస్తున్నారు.

2) శుద్ధత(Purification):- అన్ని పాపవ్యసనాల నుండి విముక్తి, ముఖ్యముగా విగ్రహారాధన, గొనుగుడు, మరియు దుర్భలాటన లాంటి వ్యాసణాల నుండి మనలను వేరు చేసి శుద్ధ మైన దారిలో నడిపిస్తాడని తెలుపుతున్నారు.

3) మంచి కాపారి(Good sherpherd):- ఒకే రాజు, ఒకే నాయకుడు, ఒకే న్యాయవంతుడు, ఒకే నీతిపరుడు, వేరే వారు లేరు, వేరే వారు ఈయన వలె వుండరు, అత్యున్నత మహా రాజు మన గొప్ప కాపరి, ఆయన ను విశ్వాసించే వారికి ఆయన వెన్నుండి నడిపిస్తాడు, కౌగిలిలో ఉంచుకుంటాడు.

4) శాశ్వత నిబంధన( Eternal covenant):- ఆయన మనకు శాశ్వత శాంతిని, మనశాంతిని ఎల్లకాలము అనుగ్రహిస్తారు, మనపై వానజల్లులవలే కురిపిస్తాడు. ఆయన నిబంధన మోసపో్రితం కాదు, నమ్మించి మోసం చేసేది కాదు, అందరిలో గొప్పలు చెప్పి ఎవరు లేనప్పుడు పట్టియించుకోకుండా ఉండేది కాదు కానీ, ఆయన ఒప్పందంమునకు లేదాయే సాటి.

5) దేవుని సన్నిధి(God's presence):- నా మందిరము వారి మధ్యన ఉండును అని పలుకుచున్నాడు. మనము దేవునివైపు చూడాలి. ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి.
ఆయన సన్నిధి మనకు రక్షణ, ఆయన సన్నిధి మనకు ఆత్మ సంరక్షణ, ఆయన సన్నిధి మనకు మేల్కొలుపు, ఆయన సన్నిధి మనకు నిట్టూర్పు., ఆయన లేనిదే మనము లేము, ఆయనతోనే మనము ఉండగలము, ఆయనలోనే మనము జీవించగలము, కావున ఆయన సన్నిదే మన పెన్నిధి అని సమర్పణమైన జీవితమును ఆయనకు అర్పించుదాం.

అవిశ్వాసులు – విశ్వాసులవటం జరుగుతుంది. రాజకీయణాయకులలో భయం పెరిగిపోతుంది. రాజకీయ ఆలోచనలు, మాటలు రోజు రోజుకి తడబడిపోతున్నాయి. దేవుని ప్రణాళిక గొప్పదని తేటతేల్లం అవుతుంది. ప్రపంచపాపలకొరకు యేసయ్య చనిపోతాడని, ఆయన త్యాయం, వర్ణించలెమని ముందుగా మనకు అర్తం అయిపోతుంది. మనుషుల అజ్ఞానముల మధ్య, కుట్రల మధ్య, వేరే వేరే అన్నింటి మధ్య దేవుని చిత్తం మాత్రం తథ్యం అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మన జీవితములో చేస్తున్న కార్యాలను బట్టి విశ్వాసం బలపడాలి, ముడిపడాలి. ఆయన మన జీవితములో చేస్తున్న కార్యాలకు లేదు సాటి, ఆయనలా ఎవరు లేరు, ఆయన వేరు, ఆయన కార్యాలు వేరు, మూడునాల్లా ముచ్చటకోసం గర్వము, స్వార్థం, అసూయ మరియు విరుద్ధాలు ఎందుకు అండి. ప్రతి స్థితిలోనూ దేవుని ప్రణాళికపై, నమ్మకం ఉంచాలి. పరిస్థితులు ఏవైన, యేలా వున్న, మనలను ఎలా దించేసిన, మింగేసినా, ఏమి చేసిన, ఆయన త్యాగానికి మనము కృతజ్ఞతలు అర్పిస్తూ జీవితకాలము మొత్తం ఆయనకై జీవించాలి. మనము ఆయనను ప్రేమించాలి. సత్యం కొరకై జీవించాలి. సత్యములో నడవాలి. సత్యములో సహవాసం చేయాలి. అది నిజ సత్య క్రీస్తు పయనం బోధ మరియు ప్రకటింపు మరి మనము అయనవలే దైర్యంగా ఉంటూ, అయన సేవలో హేరాలముగా దీవింపబడుదాము.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN