క్రీస్తును మనస్ఫూర్తిగా అంగీకరిద్దాం
.jpg)
బ్రదర్ టోనీ నాగిపోగు MSC
27 Mar 2026
తపస్కాలపు ముప్పై మూడవ రోజు
మొదటి పఠనము : యిర్మీయ :20: 10-13
సువిశేష పఠనము : యోహాను : 10:31-42
క్రీ పూ ఏడవ శాతబ్దము చివరి నుండి ఆరవ శతాబ్దం ప్రారంభములో యిర్మీయ ప్రవక్తకాలం జరిగింది.ఆకాలములో యూదదేశపు ప్రజలలో ఆత్మీయత,మరియు నైతికత పతనమవుతువచ్చాయి.దేవుని మాట వినని వారై పోయారు,విగ్రహారాదికులై పాపములో పడిపోయారు.దేవుడు దయచూపి యిర్మీయా ను అక్కడకు పంపిస్తే,అక్కడ వుండే ప్రజలు,నాయకులు మరియు యాజకులు ద్వేషించటం మొదలుపెట్టారు.పషారు అనే యాజకుడు యిర్మీయా ను కొట్టి చెరశాలలో వేస్తాడు (యిర్మీయా 20:1-2).
మంచికి రోజులు కాదండి.మంచిచేస్తే ద్వేషించటం ఏంటండీ, మంచిని పెంచితే శత్రుత్వం పెరిగిపోవటం ఏంటండీ,మంచిని వెధజళ్ళితే తీవ్రవాదులుగా తీర్చి దిదటం ఏంటండీ.యిర్మీయా ప్రవక్త ఏమైన చెడును వ్యాపింపచేశాడా,చెడును ప్రజలలో inject చేశాడా,చెడుమార్గములో నడవండని బోధించాడా, మార్గం తప్పి,మార్గములో నడవక,నాదే రాజ్యం,అనే గర్వపు జీవనాస్థితిలో జీవిస్తున్న ఇజ్రాయెల్లతో ఇది తప్పు, ఆలా చేయంకండి ఇలా చేయండి,ఆలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని మంచిని బోధిస్తే మంచిగ దైవశీస్సులతో నినపబడండి అని కోరితే......... ఆ ప్రజలు కుట్ర పన్నారు, అంతం చేయాలనీ బావించారు,ద్వేషించారు, ఒక పలికామాలిన వాడిగా చూసారు చంపడానికి సిద్ధం అయ్యారు.అంటే మంచిని బోధిస్తే బాధిస్తారా,మంచిని ప్రకటిస్తే హింసిస్తారా,అవునండి... నాటి నేటి మనుషులులకు మంచి విషమైపోతుంది, శత్రువు అయిపోతుంది. మంచి అంటే దహిచేస్తున్నారు.అందరూ ఆలా ఆయనను అనినప్పటికి భక్తి మారలేదు,విశ్వాసం కునకలేదు.స్వప్రజలు ఎన్నో మాటలు అన్నారు. ఏకదాటిగా దాడి చేయుటకు కూడా రెడీ అయిపోయారు. కానీ ఒంటరిగా వున్న యిర్మీయా కు దేవుడు అండ, దేవుని సన్నిహితం, దేవుని ప్రేమ ఆయనను విడువలేదు, మరువలేదు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని పలికిన యేసు క్రీస్తు వారి వాక్కు నిజము కాదా.....
ఆయన సర్వంతర్యామి నిజముకాదా,
ఆది నుండి వున్నవాడు నిజము కాదా,
తండ్రి కుడిప్రక్కన కూర్చుని వున్నవాడు కదా
నిన్ను నన్ను సృష్టించినది ఆయనే కదా
మనకు రూపాన్ని ఆకృతుని ఇచ్చింది ఆయనే కదా
ఆయన దేవుడు కదా
ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తి కదా
ఆయన సర్వాది కారి కదా
అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు ల కంటే గొప్పవాడు కదా
దావీదు కంటే, సొలొమోను కంటే మహా జ్ఞానికదా
బలిస్టుడు అయినా సొంసోను కంటే మహా బలిసితుడు కదా, మరి ఆయన అమాట ఆనటములో తప్పేమి లేదు కదా....
Blasphemer అన్నారు. రాళల్తో కొట్టండి అన్నారు, ద్వేషించారు, నిందలు వేసచంపాలని చూస్తున్నారు . సమాజములో వద్దు అంటున్నారు. అవసరం లేదు అని వాపోతున్నారు. ఇది సమాంజశమ......
ఆయన సేవలో కష్టాలు, ఇక్కట్లు వచ్చిన, సేవే ముఖ్యమని యిర్మీయా తెలియజేస్తున్నాడు. విశ్వాసములో బలహీనతః చూపకుండా, దృడపడుతున్నాడు ఎందుకు అంటే ఆయన ఒంటరిగా లేడు దేవుడు తనాతో వున్నాడని బలముగా విశ్వాసించాడు. ఆయనే అండ, దండ, నీడ, అని విశ్వాసముతో నిలిచాడు, తనను తాను దేవునికి పరిపూర్ణముగా మనము కూడా యిర్మీయా వలె ఆయనకు అర్పించుకోవాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోకానికి అధిపతి అయినా మన క్రీస్తువలె మనము కూడా సత్యముకై పాటుపడుదాం. సత్యమూర్తి అయినా క్రీస్తు వాక్కును, ఊపిరి వున్నంతవరకు స్వీకరిదం, పాటిదాం, మనలను మనము మననం గావించుకుంటూ, ప్రకటిదాం, అందరికి క్రీస్తు సువాసన గల పరిమళ ద్రవ్యము గల ఆయన ఆత్మీయ వాక్కును అందరిలో నాటుదాం. కావున మనము సందేహం లేకుండా విశ్వాశాన్ని ఎంచుకుందాం. భయం వద్దు, దైవ దైర్యం ముద్దు, మరియు యేసయ్యను మన జీవితాలములో మనస్ఫూర్తిగా అంగీకరీదాము.
