ఘనముగా జరిగిన అభిషేక తైలాల పూజ:

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
27 Mar 2026
హైదరాబాద్ అగ్ర పీఠంలో పవిత్ర అభిషేక తైలాల పూజ అత్యంత భక్తివంతముగా సికింద్రాబాద్ బసిలికా చర్చలో జరిగింది. హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు కార్డినల్ మహా శ్రేష్ట పూల అంతోని వారి ఆధ్వర్యంలో జరిగింది.ఉదయం నుంచి గురువులందరూ ప్రార్థనలో పాల్గొని పాప సంకీర్తనలు చేసి ఉన్నారు.సాయంకాలం ఐదున్నర గంటలకు తైలాల పూజలో పాల్గొన్నారు.గురువులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రజలందరూ కూడా గురువును గూర్చి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కార్డినల్ గారు హృదయపూర్వకంగా కోరి ఉన్నారు.
