దైవ పిలుపు మన జీవితాన్ని అందంగా మారుస్తుంది - పోప్
జోసెఫ్ అవినాష్
26 Mar 2026
జగద్గురువులు పోప్ లియో XIV ఏప్రిల్ 26 తల్లి శ్రీసభ దైవ పిలుపుల దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో తన సందేశాన్ని విడుదల చేశారు.మన జీవితంలో దేవుడు ప్రతివారినీ ప్రత్యేకంగా పిలుస్తాడు.ఈ పిలుపు బయట నుంచి వినిపించేది కాదు;మన హృదయంలో మెల్లగా వెలిగే ఒక ఆలోచన,ఒక శాంతి, ఒక తలంపు.యేసు మంచి కాపరి లాగా మన జీవితానికి నిజమైన దారిని చూపిస్తూ,“నీ జీవితాన్ని ఇలా అందంగా మార్చుకో” అని ప్రేమగా ఆహ్వానిస్తాడు.ఈ పిలుపు శ్రద్ధగా ప్రార్థనలో,నిశ్శబ్దంలో దేవుని వాక్యాన్ని వింటూ మాత్రమే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ పునీత జోజప్ప గారి వలె దేవునిపై నమ్మకం ఉంచి ముందుకు నడిస్తే, దైవ పిలుపు మన జీవితాన్ని ఆనందంగా మార్చుతుంది. దైవ పిలుపు అనేది దేవుడు మనకు ఇచ్చిన అందమైన బహుమతి; దాన్ని మన హృదయంలో కనుగొన్నప్పుడు జీవితం నిజంగా అర్థవంతమవుతుందని పోప్ పేర్కొన్నారు.
