మన దేవుడు ఉన్నవాడు

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
25 Mar 2026
తపస్కాలపు ముప్పై రెండవ రోజు
మొదటి పఠనము : ఆది : 17:3-9
సువిశేష పఠనము : యోహాను : 8:51-59
ప్రియులారా ఇక్కడ మనము దేవుని మరియు అబ్రాహాము మధ్య జరిగిన ఒప్పందమును చూడవచ్చు.ఇది చాలా ముఖ్యమైన ఘట్టం.సర్వశక్తిమంతుడైన దేవుడుగా పరిచయం చేసుకోవటం,అబ్రాహాము వినయమును (3) లో, జనములకు తండ్రిగా చేస్తానన్న వాగ్దానం,అబ్రహం ను అబ్రాహాముగా మార్చటం, సంతానాన్ని విస్తరింపచేస్తానన్నిన , రాజులు పుడతారు అని చెప్పిన మాటలను,శాశ్వతమైన నిబంధనను,శాశ్వత స్వాస్థానము అయినా కనానును ఇస్తానని, దేవుని ప్రణాళికలో అబ్రాహాముగారి పాత్ర చాలా ప్రాముఖ్యమైందని తెలుస్తుంది.
మన దేవుడు అల్పా మరియు ఒమేగా. సామాన్యమానుషలమైన మనతో ఒప్పందం పెట్టుకున్న గొప్పవాడు. మనవాడు మనందరివాడు,మన మధ్యన నివసించే నిత్య నివాసుడు.మనలను ప్రేమించటం అంటే ఆయనకు ఎంతో ప్రీతీకరము.మానవ మేధస్సు ఆయనను అర్తం చేసుకోలేదు.మన తెలివితేటలు ఆయనను పూర్తిగా తెలుసుకోలేవు.మానవ జ్ఞానం ఆయన జ్ఞానముతో సరితూగదు. ఆయన ఎక్కడ, మనమెక్కడ,ఆయన శక్తి ఎక్కడ,ఆయన సృజంచిన సృష్టి మనము,ఆయనతో మనము ఏపాటివారము,మనకు ఎల సాటి, ఎలా పోలిక, యేలా సమానము, యేలా గర్వము.అబ్రామును అబ్రాహాముగా మార్చాడు.అన్యున్ని విశ్వాసిగా మార్చాడు. ఇంటిపేరు మరియు ఊరిపేరు మారింది.జీవనవిధానం మారింది, స్థితి మారింది, వాతావరణం మారింది,ఉషోనోగృతః మారింది. తన ఇష్టాలు మారాయి,స్వీయ స్వభావము మారింది. ఒక్కసారిగా నూతనవ్యక్తిగ మరల్చాడు మన దేవుడు. విశ్వాసించాడు,దీవెనలు పొందాడు.ఆయనను నమ్మిన వారిని వమ్ము చేయడు,చేసే దేవుడు కాదు మన దేవుడు.
యేసుక్రీస్తుప్రభువు వారు కూడా నేనే దేవుణ్ణి అబ్రాహాము కంటే, ముందున్నావాడిని,ఆదియు అంతము ఎరిగినవాడిని, ప్రవక్తలకు దేవుణ్ణి అందరిని ఎరిగిన వాడు,అని, నిజ సత్య వాక్కుతో చెప్పితే వినలేదు,పెడిచ్చేవునా పెట్టారు.
అక్కడ అబ్రాహాము గారు నమ్మారు ఇక్కడ అబ్రాహాము మా పితరుడని చెప్పుకునే వారు అవిశ్వాసులయ్యారు.
అక్కడ స్పష్టతతో దీవెనలు
ఇక్కడ స్పస్టత లేని మాటలు
అక్కడ గుండెనుండ దైవ వాక్కు
ఇక్కడ గుండెనిండా ప్రధానార్చకుల మాటవాక్కు
అక్కడ ఒప్పందం
ఇక్కడ సంబంధం లేని మాటలు
అక్కడ జీవన్నిచే నిత్యమలుపు
ఇక్కడ జీవాణ్ణి పొంధుకోలేని ముళ్ల మలుపు
అక్కడ విధేయత, అర్పణ మరియు సమర్పణ
ఇక్కడ అవిధేయత
అక్కడ విన్నాడు, మారాడు మరియు మారేలా చేసాడు ఇక్కడ విన్నారు, మారలేదు మరియు మదిలో మార్పు లేదు.
అర్తం కావటం లేదా ప్రియులారా దైవానికి తల వంచితే తలగ చేస్తాడే కానితోకగా చేయడు. నమ్మినవారిని, నమ్మకస్తులను, నమ్మకముతో విశ్వాసములో జీవిస్తున్నావారిని, నమ్మకాన్ని వేదజల్లేవారిని, ఆయన మరువడు, విడువడు ఎడబాయదు. విశ్వాసి మారాలని ఆరాటపడుతున్నాడు. అవిశ్వాసి కీ మారాలానే బుద్ధి ఉందదు. మరి నీవు నేను మనము యేలా వుంటున్నాము మారాలని అనుకున్నతున్నావా, మారాలని వున్నామా, మారదమూలే అని వున్నామా , లేక మారవచ్చులే,అని వున్నామా మనలో మనము ఆత్మపరిశీలన గావించుకోవాలి. విశ్వాసి జీవితములో తమను తాము మరిచిపోకూడదు. విశ్వాస సన్నాగిల్లాకూడ చూసుకోవాలి. పడకూడదు, బలపడాలి, వినాలి ధ్వనింపచేయాలి, ఎప్పుడు అయితే విశ్వాసము బాలహీన పడుతుంధో అత్తంపరిశీలన గావించు కోవాలి. మనము విశ్వాసములో నడవాలి. కావున ఎటువైపు నీ విశ్వాస ప్రయాణం, నమ్మని ఈ యుదుల వైపా, దైవశాసులను పొందుకున్న అబ్రాహాము విశ్వాసము వైపా
అబ్రాహాము విశ్వాస పాత్రుడు. వినమ్రడు, వినయుడు, స్కత్యవంతుడు. దైవముపై ఆశపవట్టుకున్నాడు, దైవాన్ని ఎదురించచాలేదు, తిరస్కరించలేదు. ఇలా వున్నాడు కాబట్టే ఒప్పందం, స్నేహబంధము,, స్నేహము, మరియు స్వేచ్ఛ స్నేహపలికరింపు. కావున మనము ఎటువైపు వెళ్తున్నాము. ఎక్కడికి మన విశ్వాసము తీసుకువెళ్తుంది, ఎక్కడికి బాటలు వేస్తుంది, అని ఆత్మపరిశీలన చేసుకుందాము.
