ఆత్మ బలము తోడ అడుగు వేయి!.

డా. కల్లూరి ఆనందరావు
25 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................................
ప్రతిభ యున్న నాడు పరుల సాయమదేల?
నీకు గొప్ప బలము నీవె కాద?
మాయ చేయువాని సాయమ్ము నీకేల?
ఆత్మ బలము తోడ అడుగు వేయి!.
