శ్రీసభలో అధికారం సేవ కొరకే - పోప్

జోసెఫ్ అవినాష్

25 Mar 2026

కతోలిక సంఘంలో వివిధ స్థాయిలలో సేవలందిస్తున్న పీఠాధిపతులు,ఫాదర్లు,డీకన్లు ఉన్న నాయకత్వ నిర్మాణం మనుషులు తయారుచేసుకున్న వ్యవస్థ కాదని.ఇది యేసు తన అపొస్తలులను నియమించినప్పటి నుంచి ఉన్న దేవుని ఏర్పాటు చేసిన పద్ధతని జనరల్ ఆడియన్స్ సందర్భంగా పోప్ అన్నారు.దైవాంకితుల పని ప్రజలకు దారి చూపటం, దేవుని వాక్యం చెప్పటం,సంఘాన్ని ఐక్యంగా ఉంచటం. కానీ దీనివల్ల సాధారణ క్రైస్తవుల విలువ తగ్గదు. జ్ఞానస్నానం తీసుకున్న ప్రతి ఒక్కరూ శ్రీసభ సేవ పరిచర్యలో సమానమైన భాగస్వాములు.ప్రతి ఒక్కరికీ ఒక విధమైన సేవ ఉంది. పీఠాధిపతులు-ఫాదర్లు నాయకత్వం ఇస్తారు;ప్రజలు విశ్వాసంలో నిలబడతారు.అందరూ కలిసి ఉన్నప్పుడే శ్రీసభ జీవిస్తుంది. శ్రీసభలో అధికారం సేవ కొరకే అని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN