దైవ చిత్తానికి అవునందాం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
24 Mar 2026
తపస్కాల ముప్పై ఒకటవ రోజు
మొదటి పఠనము : యెషయా :7:10-14a 8:10
రెండవ పఠనము : హెబ్రీ 10:4-10
సువిశేష పఠనము :1:26-38
ప్రియులారా యూధారాజయినా ఆహాజు కాలములో రెండు శక్తివంతమయినా రాజ్యాలు యూదా రాజ్యముపై (ఇజ్రాయెల్ ఉత్తర రాజ్యం మరియు సిరియా దాడి చేయటానికి బయలుదేరుతారు రాజు ఆహాజు చాలా బయపడతాడు. దేవునిపై నమ్మకం పెట్టుకోకుండా మానవ సహాయాన్ని ఆశ్రాయించాలని బావిస్తాడు. అప్పుడు దేవుడు యెసయా ప్రవక్తను పంపి ధైర్యాన్ని తెలపటం, ఒక సూచక బావన్నీ అందించటం, దానిని ఆహాజు “నేను దేవుణ్ణి పరీక్షించను” అని తిరస్కరింపుగా మాట్లాడటం, అవిశ్వాన్ని కనపరచం జరుగుతుంది. ఇటువంటి సందర్బంలో ప్రవక్త (7:14 )కన్య గర్భవతి అయ్యి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రవచిస్తాడు. రాబోయే మెసయ్య గూర్చి పలికిన ప్రవచనం సువార్తలో నెరవేరింది. యేసు జననం జరిగింది. ఇది messianic prophesy. ఈ వచనాలు మనకు దేవుడు వున్నాడని దైర్యం ఇస్తుంది. బయపడకూడదు అని, నమ్మకం చాలా ముఖ్యమని, దేవుని సహాయం చాలా గొప్పది అని, దేవుడు తన ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటాడని, ఇమ్మానుయేలు ద్వారా రక్షణ తద్యం అని నిశ్శ్యయముగా అభయమును ఇస్తున్నాడు.
ఈ రోజు తల్లి శ్రీసభ మంగళవార్త మహోత్సవమును జరుపుకుంటుంది. మొదటి శత్తాబ్దపు క్రైస్తవులు ఈ పండుగను ప్రారంభించారు. 4-5 వ శతబ్దాలలోప్రారంభించారు. ముఖ్యముగా తూర్పు (Eastern Church )మరియు పాశ్చత(Western Church )లలో ఈ పండుగను చేస్తారు.ఈ పండుగా ప్రత్యేకత
దేవుడు మనుషునిగా మారిన వేళ, దేవుని కృప,మరియతల్లి విధేయత,మరియు దేవునికి అసాధ్యమైనది ఏమి లేదని, దేవుడు మానవాలి రక్షణ కోసం తన రక్షణ ప్రణాళిక ప్రారంభించాడు. “అవును” అని చెప్పటం. అసాధ్యమైనది ఏమియు లేవని ఈ పండుగ మనకు మనసారా తెలియజేస్తుంది.
ప్రియులారా మన అనుదిన జీవితములో దేవుని ప్రేషితమయినా ప్రణాళికకు “YES” చెప్పటం నేర్చుకోవాలి. ఆయన చితానికి yes చెప్పిన వారు దీవింపబడారు, ఆశీర్వదింపబడ్డారు, జనములకు ప్రవక్తలుగా ఏర్పరచబడారు. ఆహాజు yes అని పలకలేకపోయాడు, దేవునిచ్చితానికి తలవంచలేక పోయాడు. తిరస్కరించాడు. దేవుని శక్తి కన్నా మానవ శక్తి మిన్న అని బావించాడు. ఆయనను విశ్వసించని వారు “NO” అంటారు. Yes అనే పదం నోటిలో నానాలి అంటే దేవుణ్ణి నమ్మాలి, ఆయన చితాన్ని విశ్వాసించాలి, ఆయనకు విధేయులమై జీవించాలి. విధేయత నిన్ను yes కు స్నేహాసంబంధం కల్పించగలదు. No నిన్ను దేవునికి దూరం చేయగలదు. Yes అని తలవంచిన వారికి శాశ్వత విమోచనం, కచ్చితమని పూనీత పౌలు గారు పలుకుచున్నారు (హెబ్రీ 10: 4-10). హృదయ విధేయత ఉతమైనది. యేసుక్రీస్తు వారి రక్షణ బలి సంపూర్ణమైంది. విశ్వాసులమై ఆయనకు ప్రియులుగా నిలవాలి yes అంటూ జీవితాలను ఆయనకై అంకితం చేసుకోవాలి మరి నీవు నేను మనము ఎలా ఉంటున్నాము, ఎలా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తునాము అని ఆత్మపరిశీలన గావించుకోవాలి.
మరియతల్లి “YES” చెప్పింది దేవునికి.
లోకానికి no, ఆశలకు no, వాంఛలకు no, కోరికలకు no, సమాజమేప్పుకు no, ఆర్బాటలకు no, అలంకారాలకు no, దేవుడు లేని ప్రదేశాలకు no, దైవ చిత్తం లేని పనులకు no, వేశ్యదారణకు no, మాయమాటలకు no, కలుషితమైన జీవితానికి no, మాలినమైన మనుషులకు no, ఫాంటసీ లోకానికి no, social మీడియా కు no, ఆకర్షణకు no, పబ్లిసిటీ కీ no, fanbase కు no, ఈ విధముగా అన్నింటికీ no చెప్పేసి దేవుని ప్రణాళికకు yes చెప్పిన దైవమాత మన తల్లి మరియమ్మ. నేటి సమాజం వేటికి అయితే yes చెప్పుతుందో, వాటికి నేటికీ మరియతల్లి no చెప్పుతుంది. మనము అన్నింటికీ yes అంటాము, ఆమె దైవ క్రియల, బావన సమయమునకు, విశ్వాసమునకు, భక్తి ఆత్మీయతలకు మాత్రం yes చెప్పింది. So yes అని అని తలవంచింది కాబట్టే రక్షణ వచింది నీకు నాకు మనకు, మరి ప్రియులారా దేనికి నీవు yes అంటున్నావు, దేనికి నీవు no అంటున్నావు. దైవ పిలుపుకు yes చెప్పాలి,ఆయన ప్రేమకు, ఆయన బలియాగమునకు, ఆయన ప్రేషిత రక్షణ కార్యమునకు, మనము మరియ తల్లి వలె yes అని దేవుని ప్రియా కుమార్తెగాను, కుమారుణిగాను, జీవిదాం.దైవరాజ్యావిస్తరణలో మరియతల్లి yes తో మన yes ను జతచేసి, బోధ విస్తరణ ప్రకాశిత ప్రకటింపునకు మనము అందరము నాంది పలుకుదాం.
