విమానాలు యుద్ధానికి కాదు శాంతికి రెక్కలు కావాలి - పోప్
జోసెఫ్ అవినాష్
24 Mar 2026
జగద్గురువులు పోప్ అపోస్తలిక ప్రయాణాలకు సేవలందిస్తున్న ITA ఎయిర్‌వేస్ సిబ్బందిని పాప్ లియో XIV కలుసుకుని,తమ ప్రయాణాలు ప్రశాంతంగా సాగేందుకు వారు చూపుతున్న నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.పాపల్ బృందం మరియు పాత్రికేయుల కోసం అందించే గౌరవపూర్వక వాతావరణాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.విమానాలు శాంతి సందేశాలు తీసుకెళ్లే సాధనాలుగా ఉండాలని,యుద్ధానికి వేదికలుగా మారకూడదని పాప్ తీవ్రంగా పేర్కొన్నారు.బాంబింగ్ దాడులు లేదా ఆకాశాన్ని యుద్ధ రంగంగా మార్చే చర్యలు మానవత్వానికి అవమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, అది విధ్వంసానికి కాకుండా మేలుకు ఉపయోగపడితేనే నిజమైన పురోగమని పాప్ అన్నారు.త్వరలో జరగనున్న తన ఆఫ్రికా పర్యటనను గుర్తుచేస్తూ,ప్రజలను కలసి ధైర్యం,ఆశ,శాంతి సందేశాన్ని పంచుకోవడమే ప్రతి అపోస్తలిక పర్యటనల యొక్క అసలు లక్ష్యం అని పాప్ లియో XIV తెలిపారు.
