ఒదిగి పోవుట విన యేది సుఖము?.

డా. కల్లూరి ఆనందరావు
22 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
పలుకరించినంత ప్రాణమ్ము పెట్టెడి
పెన్నిధి యగు ప్రేమ యెంత ఘనము?
గురుతు పట్టినంత గుండె కౌగిళ్ళలో
ఒదిగి పోవుట విన యేది సుఖము?.
