నేనే జీవమన్న యేసువాక్యం – మృతిని మార్చే శాశ్వత సత్యం

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

22 Mar 2026

పాస్కాయత్త ఐదవ ఆదివారము,
మొదటిపఠనము : యెహెఙ్కేలు : 37:12-14
రెండవ పఠనము: రోమీ :8:8-11
సువిశేష పఠనము : యోహాను 11:1-45
ప్రియులారా ఈ 37 వ అధ్యాయం “ఎండిన ఎముకల లోయ దర్శనం”(Valley of dry Bones) గా ప్రసిద్ధి చెందింది. దీని ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఒక గొప్ప ఆశ మరియు పునరుద్దరణ సందేశము అందింది. బబులోనూ చెరలో ఇజ్రాయెల్ ప్రజలు వున్నారు. స్వేచ్ఛను, దేశాన్ని, ఆలయాన్ని కోల్పోయి మేము ఎండి పోయిన ఎముకలమై పోయాము, మా ఆశ, నశించింది అని వాక్యము ద్వారా మనకు అర్తం అవుతుంది. దేవుడు వారికి అభయముగా నిలుచుతూ అంటున్నారు, నేను సమాధులను తెరచి, మిమ్మల్ని బయటకు తీసి, స్వదేశానికి తీసుకువస్తాను అని, ఇక్కడ గమనించాలి నిజముగా చెనిపోయిన వారిని లేపటం కాదు, ఆత్యాత్మికముగా మృతులు అయినా ప్రజలకు కొత్త జీవం ఇవ్వడం. తన ఆత్మను వారిలో ఉంచి వారికి జీవం ఇస్తాడని పలుచుచున్నాడు. వారికీ నిరాషలో ఆశగా చనిపోయిన వారి అన్నింటికీ జీవాన్ని ఇస్తానని, ఇజ్రాయెల్ ప్రజలు పునరాగమనాన్ని మరియు సువిశేష పఠనపు లాజరు లేయటం తో వున్నా (Restoration) ను ఈ రోజుటి మూడు పఠనాలు మనతో మాట్లాడుతున్నాయి. మన క్రైస్తవ ద్రుష్టి (Resurrection), ఆత్మీయ పునరుదీకరణ, ఎండిన ఎముకలు మళ్ళీ జీవించినట్లే మన ఆశలు దేవుని ఆత్మ ద్వారా పునరుధరణ గావింపబడతాయి అని, విశ్వాసం ఉంచాలి అని తల్లి శ్రీసభ మనకు ఈ పాస్కాయత ఐదవ ఆదివార పఠనాలతో మాట్లాడుతుంది.

ఆవిరి అయిపోయిన మన జీవితాలకు, ఎండిపోయిన మన బ్రతుకులకు, గమనం లేని మన ఉనికికి, చలనం లేని మన స్థితికి, ఆశ ఒక్కరే, మళ్ళీ జీవాన్ని ఇచ్చే జీవాధిపతి ఒక్కరే అయన తప్ప మనలను ఎవరు కాపాడలేరు, కాపాడరు ఎండిపోయిన ఎముకలమై పోయాము, మాకు స్వేచ్ఛ లేదు, సమన్వయం లేదు, ఊపిరి పీల్చుకోలేక పోతున్నాము, చితిలమై పోయాము, మాజీవితాలలో, మాలో ఆశ నశించి పోయింది, అని చెరలో వున్నా ప్రజలు మూలుగుతున్న తీరు వర్ణానాతీతం. ఇశ్రాయిలు ఆత్యాత్మికముగా మృతులై పోయారు, దేవుడు లేడు, దేవాలయము లేదు, విశ్వాసము లేదు, ( యెహెఙ్కేలు 37:12-14), భక్తి లేదు, భయములేదు, ఆజ్ఞ్యానుశారము అయినా జీవితం లేదు, దైవ ప్రణాళిక లేదు, దైవ నిచలాత్వం లేదు, దైవ సాన్నిహిత్యం లేదు, దైవ సుకృతం లేదు, దేవుడు ఆశీర్వాధించేకొద్దీ, దేవునికి దూరమై ఆత్యాత్మికముగా మృత్తులు అయి పోయారు, లోకమే సుఖము అనుకున్న వీరు, దేవుని కృపకై వేచివుంటున్నారు. ఎండిపోయారు, నలిగిపోయారు, బ్రతికివునా జీవం లేని వారు, బలహీనూలై, “ ఎండిపోయిన ఎముకలతో తమను తాము పోల్చుకుంటున్నారు”. (37:14....సెలవిస్తుంది, నేను నా ఆత్మను మీలో ఉంచి, మీరు జీవించినట్లు చేయుదును) అని ప్రభువు పలుచున్నాడు. ఈ సంఘటనను మనము సువిశేషముతో ముడివేస్తే,(పునరుతానబాగ్యము). ఆత్మీయ పునరుదీకరణ కావలి విశ్వాసములో మనము రోజురోజుకి పెరగాలే కానీ, బలహీనులం కాకూడదు. నీ విశ్వాసం ద్వారా నీకు పచ్చధనము, మెరుపుతనము, క్రొత్తజీవితం, నవ్యజీవితం, నవ్యమైన ఆశీర్వాదం, జీవం గల ఆధ్యాయణం, జీవానిచే ఆత్మీయం, జీవముతో నడిపించే ఆత్మీయ సన్నిహితబావం జరగదు అని అనుకున్న నీవు, సకాలములో అన్ని జరుగుతే నీ జీవితం జీవమున్నా ఎముకలవలే నిత్య సంతోషమును పొందుకోగలవు.

రోమీయు 8:9......పునరుతానా వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. పునీత పౌలు గారు శరీర ప్రకారము కాకుండా, ఆత్మ ప్రకారము జీవించాలని, దేవుని ఆత్మ మనతో ఉండాలని, ఆయన పునరుతానం మనకు నూతన జీవం, ఆత్మలో నడిచే జీవితం ఆయనకు ఇష్టమైనది. గమనించండి ప్రియులారా “దేవుని ఆత్మ” మనము మొదటిపఠనములో చూశాము మరియు ఇక్కడ చూస్తున్నాము, అక్కడ లాజరులో ప్రవేశించటం కూడ చూస్తాము. దేవుని ఆత్మ మనలో ఉంటే ఎండిన ఎముకలకు జీవం వచ్చింది, అదే ఆత్మ నీలో వసిస్తే ఆయేండు తనం, ఆ రాలిపోయినతనం, మనలో ఉండదు, మనము మూలకగానవసరము లేదు, ఆత్మ ప్రకారం మనము జీవించాలే కానీ, శరీరఅనుసరాము కాదని, వాక్యము నొక్కివక్కాస్తుంది. జీవం నీలో ఉంటే, ఆత్మ నీతో ఉంటే, ఆత్మ నిన్ను వెంబడిస్తే, ప్రేమిస్తే, దరిస్తే, ఆలింగణం చేసుకుంటే, ముందుకు వెళ్తే, ఆత్మ ప్రేరణంగా రాణించగలుగుతారు కొత్త జీవితం మనకు సహజమవుతుంది. నీలో ఆ ఆత్మ ప్రేరణ లేని రోజున ఎముకలవలే ఎండిపోవాల్సిందే, మూలగాలషిందే, దేవుని సహాయముకై నిరీక్షించాలిషిందే, మనము ఎలా ఉండాలి,, ఎలా జీవించాలి, ఎలా భక్తిని కనపరచాలి, ఎలా ఆత్మీయాతలో రాణించాలి, ఎలా ఇష్టం అయినా వారుగా మెలగాలి, అంటే అజీవము నీలో ఉండాలి, లేని నీభక్తిని కొనసాగిస్తున్నావా, నిరాశతో వుంటున్నావా, జీవాణ్ణి ఓసగే వారు లేరని దిగుల, దేవునితో మనకు వున్నా ఆత్మ స్వభావమను, ఎలా పవిత్రం చేసుకుంటున్నావు. శరీర స్వభావమును ఎలా దేవుని కొరకై వదులు కుంటున్నావు, అని ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ఆత్మలో నడిచే జీవితం దేవునికి ప్రియమైనది. ఇప్పుడు మనము కొంచెం లోతుగా వాక్యమును మననం చేసుకుందాము.

1) స్నేహ సంబంధము : యోహాను 11:5
యేసుక్రీస్తు వారు మార్థమ్మను, ఆమె సహోద్దరిని మరియు లాజరును ప్రేమించేను. వీరి మధ్యవున్న స్నేహబంధము చాలా గట్టిది. సన్నిహితులు, ప్రియమైన వారు, గౌరవించే వాడు, దరికి చేర్చుకునేవాడు, అంత ప్రేమ వుంది కాబట్టే లాజరు చనిపోయాక యేసుక్రీస్తు వారు ఏడ్చారు. 11:35 లో యేసు కంఠతడి పెట్టెను అని వాక్యము సెలవిస్తుంది. ఆయన అయన బంధం నుంచి ఎవరు దూరం చేయలేరు.

2) ఆలస్యం వెనుక ఉదేశ్యము : ఆలస్యము చేస్తాడేమో కానీ, అన్యాయం చేయడు మన ప్రభువు. 11:3 లో మీరు ప్రేమించు లాజరు అశ్వస్థతకు గురయ్యాడని వింటాము,, అప్పుడే స్వస్థత చేసి ఉండవచ్చు, కానీ ఆయన సమయము వేరు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ చేయాలో అంతయు ఎరిగిన వాడు, ఎందుకు చేయలేదు, యోహాను 11:4 ఇది దేవుని మహిమ కొరకును మహిమ పరచబడుటకొరకును వచినది అనెను. మన సమయం కోసం కాదు, ఆయన సమయము కై మనము వేచి ఉండాలి, రక్షణ పొందాలి, ఆలస్య ము అవుంతుందని నిన్ను నీవు బలహీన పరచ్చుకోకు, బలముతో ఆయనలో విశ్వాసం పెంచుకో.........

3) విశ్వాస పరీక్ష : దేవుడు పరీక్షిస్తాడు. యోహాను 11:6 లో లాజరు అనారోగ్యముతో వున్నాడని యేసు వారికి తెలియదా, ఆయనకి మానవత్వం ఉండదా, దయ మరియు కనికరం లేనివాడా, ప్రేమను చూపని వాడ, ఆలా కాదు కదా, మనలను బలముగా మరలచ్చుటకు కొన్ని సార్లూ విశ్వాస పరీక్షలో ఉంచుతాడు. ఆయనే స్వయముగా పరీక్షస్తాడు. మనము క్రుంగిపోకూడదు, భక్తి్హీనులము కాకూడదు అవిశ్వాసులము కాకా నిందైనా ఆశతో ఉండాలి. నీ పరీక్షలో నీవు నెగ్గితే ప్రపంచములో ఎక్కడైన నీవు నెగ్గగలవు.

4) యేసు వారి బోధ : యోహాను 11:25....
నేనే పునరుతణమును, జీవమును, అని సజీవ వాక్కుతో అందరిని ఆశర్యపరిచ్చాడు. కనివిని ఎరుగని రీతిలో ఆయన పునరుతానం గురించి విపులీకరించాడు. ఆయన బోధన ఎంతో మందిని మార్చింది, ఊరట నిచ్చింది.

5) యేసుక్రీస్తు వారు కరుణాలుడు : యోహాను :11:35
యేసు కంఠతది పెట్టెను. ఆయన మన బాధలలో భాగస్వామి, మన కష్టాలలో కాణామయుడు, మన రోధనలలో రక్షకుడు. మనము ఏడిస్తే నవ్వే వాడు కాదు ఆయన. మనము క్రుంగిపోతే గంతులు వేసే మనస్తత్వం ఆయనకు లేదు, దయగలవాడు, తన వ్యక్తి చనిపోయాడని ఏడుస్తున్నాడు.... మనము ఏడిస్తే ఆయన ఏడుస్తాడు.

6) అద్భుతం :యోహాను 11:42
అప్పుడు యేసు బిగ్గరగా “లాజరు వెలుపలికి రమ్ము” అని పలికెను. 44......చనిపోయిన వాడు వెలుపలికి వచ్చెను. ఎప్పుడో చేసి ఉంటే ఇంత వచ్చేదా అని మనము అరకొర జ్ఞానముతో డ్యాణించిన, ఆయన ముందు మనము ఎపాటి వారము. లేయు అన్నాడు లేచాడు. బండ రాయి, కట్లు, గుండ్లు, ఆ చీకటి, ఆ అంధకారం, ఆ బయము, ఆ దురవాసన, ఆ కంపు అన్నియు ఒక్కసారిగా కనపడకుండా పోయాయి. పునరుతానా క్రీస్తు మాటలు మాత్రం లాజరు లేచ్చుటలో కనపడాయి. అందుకే కొన్ని జరగాలంటే, కొన్నిటిని అధికమించాలి, అప్పుడే మనము కూడ లాజరు కు జరిగిన అద్భుతము మన జీవితాలలో ఆణువణువూనా జరుగుతుంది.

7) ప్రధాన బోధ : యేసుక్రీస్తు వారికి మృతిపై అధికారముంది. ఆయన అధికారము గల ఆదిక్యుడు. సమస్తమును ఎరిగిన సౌమ్యుడు. అత్యంత అద్భుతములు చేయగల సామార్తుడు. నిత్య, సత్య సజీవుడైన వారు మన ప్రభువు. సమాధివలే నీ సమస్యలు ఉన్నాయా, యేసుక్రీస్తు వారు మృతి పరిస్థితితులను కూడ జీవముగా మారుస్తాడు. మనము ముగిసిపోయింది అనిపించే చోటకొత్త ప్రపంచాన్ని చేస్తాడు. నీవు, నేను, మనము అంత అయిపోయింది అని చేతులు కడిగేసుకోకుండా, మన జీవితాలలో కూడ ఎండిపోయిన, యెగిరిపోయిన, మృతి లాంటి సమస్యలలో ఆయన అద్భుతకార్యాలు బలముగా జరగాలని ప్రార్తించుకుందాము.
దేవుడు మనలను దీవించును గాక

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN