సత్యానికి మార్గం క్రీస్తు

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

20 Mar 2026

తపస్కాలపు ఇరవై ఎనిమిదవ రోజు
మొదటిపఠనము : యిర్మీయా 11:18-20
రెండవపఠనము : యోహాను 7:40-53
ప్రియులారా యిర్మీయా 11 వ అధ్యాయము ప్రధానముగా దేవుడు మరియు ఇజ్రాయెల్ ప్రజలమధ్య వున్న ఓడంబడిక (Covenant ) గురించి చెబుతుంది.ప్రజలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి విగ్రహారాధనలో పడిపోయినందుకు దేవుడు వారికి శిక్షను ప్రకటిస్తాడు.ఈనాటి వచనాలలో యిర్మీయా ప్రవక్తపై తన ప్రజలు కుట్ర వదిస్తున్నారని,వ్యతిరేకులవుతున్నారని దేవుడు తెలియజేయటం,అమాయక గొర్రెపిల్లలాగా యిర్మీయా బలి కాబోతున్నాడని,ఆయనకు తెలియకపోవటం ఇక్కడ చూస్తున్నాము ఆయన నిర్దోశిత్వాన్ని మరియు వినయన్ని ఇక్కడ మనము చూడవచ్చు.అనాతోత్ గ్రామ వ్యాస్తవ్యులు అతన్ని చంపాలని యత్నిస్తున్నారు,( యిర్మీయా 11:21),అని మనము ఇక్కడ చూడవచ్చు.ఇన్ని వున్నా దైర్యముగా నిలుస్తున్నాడు ప్రవక్త యిర్మీయా గారు.న్యాయస్తుడయిన దేవుని మీద నమ్మకాన్ని వదలని విశ్వాసి యిర్మీయా,ఆయన కష్ట బాధలను దేవునిచేతిలో ఉంచుతూ దేవుడే న్యాయం చేస్తాడని తన విశ్వాసమును అందరికి తెలియజేస్తున్నాడు (యిర్మీయా 11:19-20).

ఆత్మీయ సత్యం :- ప్రవక్త యిర్మీయా ప్రతీకారం తీర్చుకునే వాడిగా కాకా,దేవుని న్యాయముపై విశ్వాసం ఉంచుతున్న భక్తుడు.దేవుని సేవకులు నిజం మాట్లాడినప్పుడు ప్రతిఘటనలను ఎదుర్కొనటం సహజత్వం.నిర్దోషులు కూడ బాధపడవచ్చు,కానీ దేవుడు చూస్తూ ఉంటాడని వాక్యం మనతో మాట్లాడుతుంది.

మన అనుదిన జీవితములో దేవుణ్ణి ఎలా చూస్తున్నామని ధ్యానం చేసుకోవాలి.ప్రజల మాటలు విని సందేహముగా మారుతున్నామా లేక నిజాన్ని గ్రహించి దైర్యముగా ఆయనవైపు నిలబడుతున్నామా......... యిర్మీయా ప్రవక్తకు దేవునిపై సంపూర్ణమైన స్పష్టత వుంది.దేవుడు ఎంత గొప్పవాడో,ఆయన మంచితనం,ఆయన మేధస్సు,చిత్తం,ఆయన ఆలోచనలు అన్నింటిపై యిర్మీయాకు స్పష్టత వుంది కాబట్టే దైర్యముగా మాట్లాడసాగాడు.ఎంతమంది వున్నా దేవుడు వున్నాడని బలముగా నమ్మాడు ఆనమ్మకం ప్రకారం ప్రకటించాడు,ప్రకటించిన ప్రకారం దైర్యవంతుడయ్యి దేవుణ్ణి ఇతరులకు అందించాడు.అతనికి ఒకేఒకదిక్కు దైవదిక్కు, దేవుడే తన రక్షణ మూర్తి అని విశ్వాసించాడు. అదే విధముగా క్రీస్తును కూడ హతమార్చుటకు యూధులు సంసిదమయ్యారు. కుట్ర పడటం మొదలయింది. సందేహాలు ఎక్కువవుతున్నాయి.సమయం కోసం ఎదురుచూతున్నారు, చెరశాలలో వేయాలని ఆవలిస్తున్నారు ( యోహాను 7:45). ఆయన అంటే గిట్టటం లేదు,ఆయన క్రియలు అంటే అసహించుకుంటున్నారు.కోపముతో రగిలిపోతున్నారు ఆయన ఉనికిని జీర్ణించుకోలేకపోతున్నారు.ఆయనణామమును సహించలేకపోతున్నారు.చేయవలసిన రాజకీయం చేస్తున్నారు.పన్నాగాలు బలపడేలా తిరుగుతున్నారు.విశ్వాసములో రానింపబడకుండా,విశ్వాహీనులయి హీనత్వమును కనపరుస్తున్నారు.వారిని చూసి ప్రజలలో విభిన్నాలు,సందేహాలు,విబేధాలు మొదలవుతున్నాయి.పరిష్కారమును వేదకక,సమస్యలను పెంచుతున్నారు క్రీస్తు పై అవగాహన స్పష్టత వున్నప్పుడు,నీకోదేమువలె దైర్యముగా ప్రభువు కొరకు మాట్లాడవచ్చు(యోహాను:7:50-52).సత్యాన్ని విన్నప్పుడు, చూసినప్పుడు,సత్యం లో నడిచినప్పుడు మన ఆత్మీయ హృదయ తలుపులు తెరువబడాలి,మూయబడకూడదు. ఆయనవాక్కు మన జీవితాలను మార్చే సజీవ సత్య వాక్కు కాబట్టి యిర్మీయా వలె,బలమైన విశ్వాశాన్ని కనపరుస్తూ శాంతికి నిలయమైన,లోకరక్షకుడయినా క్రీస్తు వలె మన జీవితాలను స్పష్టతతో నింపుకోవాలి దేవుని రాజ్యములో,.. కావున అటువంటి ఆత్మీయ స్పష్టత రావాలని మనసారా దేవుని కరుణను అడుగుదాం.......

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN