నేటి పునీతులు : పునీత కుత్ బెర్ట్ (క్రీ.శ.635-687)

ఫాదర్ ఆకుల ప్రసాద్
20 Mar 2026
సుగుణం: "స్వస్థత, ప్రవచన కారుడు”
పునీత కుత్ బెర్ట్ గారు తమ ప్రాంతానికి చెందినవాడని ఐర్లాండు,స్కాట్లాండు మరియు ఇంగ్లాండు దేశస్థులు వాదిస్తుంటారు.కానీ పునీత బెడె గారు చెప్పిన ప్రకారం కుత్ బెర్ట్ గారు బ్రిటన్ లోని ఉంబ్రియా ఉత్తరప్రాంతంలో క్రీ.శ.635 లో ఓ మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు.చిననాడే తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా పెరిగినా వీరు జీవనోపాధికై గొర్రెలకాపరిగా పనిచేశారు."విన్ విడ్ ఫీల్డ్" యుద్ధంలో పాల్గొన్న వీరు తరువాత జీవితంపై వైరాగ్యం చెంది,మెల్ రోస్ మఠంలో ప్రవేశించి గురువుగా అభిషేకింపబడి పవిత్రత,జ్ఞానసముపార్జనతో గురుత్వసేవలందించారు.సెల్ టిక్ అర్చనాకాండ స్థానంలో రోమను అర్చనాకాండను అమలుచేయు విషయంలో వచ్చిన విభిన్నమైన వ్యతిరేఖతలతో మఠాధికారులమధ్య,గురువుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.పునీత కుత్ బెర్ట్ గారు కూడా మఠం నుండి వెలివేయబడ్డారు.అట్టిపరిస్థితులలో కుత్ బెర్ట్ గారు నిరుత్సాహపడక తన తెలివితేటలతో,ఆదర్శ పరిశుద్ధ జీవితంతో క్రైస్తవులందరిని ఒక త్రాటిపైకి తీసికొని వచ్చి రోమను అర్చనా విధానానికి వారు అలవాటుపడేలా కృషిచేశారు.కుత్ బెర్ట్ గారు దగ్గరలోని ద్వీపంలో విశ్రాంతితో, ధ్యానంలో నిమగ్నం కావాలనుకున్నారు.కానీ దేవుడు వారిని పునీత ధియోడోరుగారి హస్తాలమీదుగా లిండిస్ ఫేర్న్ పీఠానికి బిషప్పుగా అభిషేకించారు.ఒక సంవత్సరం పాటు ఎనలేని సేవలు చేసిన వీరు ప్లేగు అంటువ్యాధి బారిన పడిన ఎంతోమందిని తన దివ్యహస్తాలతో స్వస్థతపరిచారు.దేవుడు వీరికి స్వస్థతావరాన్ని,ప్రవచనా వరాన్ని అనుగ్రహించారు.కుత్ బెర్ట్ గారు క్రీ.శ. 687లో పరలోకప్రాప్తినొందారు.వీరు 'ఇగ్లాండుదేశ అద్భుతకారుడు" అని ప్రసిద్దిచెందారు.దుర్ హాము కేథెడ్రలునందు వీరి దేహం భద్రపరచపడినది.వీరు మరణించిన 400 సం!ల తర్వాత సమాధి తెరచిచూడగా వీరి దేహము ఏమాత్రము శిధిలమవ్వకపోవడం విశేషం.వీరు ఓడ ప్రయాణికుల పాలక పునీతులు.
పునీత కుత్ బెర్ట్ గారా మాకొరకు ప్రార్ధించండి!
