దేవుడు మనతో ఉన్నారు

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
20 Mar 2026
తపస్కాల 27వ రోజు, శుక్రవారం,
మొదటిపఠనము : సొలొమోను 2:1a, 12-22
రెండవ పఠనము : యోహాను 7:1-2,10,25-30
యోహాను 7:30....వారు ఆయనను పట్టుకొన యత్నించిరి. కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయి వేయలేదు.
ప్రియులారా ఈ రోజుటి వాక్యములో దుష్టులు (wicked people) తమలో తాము ఆలోచించుకుంటూ నీతిమంతులపై ఎలా కుట్ర పన్నారో చూపిస్తుంది.వారు దేవుని నమ్మకాన్ని తిరస్కరించి,జీవితం తాత్కాలికమని బావిస్తున్నారు.జీవితం చిన్నదని,మరణం తర్వాత ఏమి లేదని సుఖమే శాశ్వతమని, బావిస్తున్నారు. ఈ తరుణములో ఎవరైనా భక్తిగా,నీతిగా, జీవిస్తే వారిపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.నీతిపరులు చెడు పనులు చేయరు గనుక వారికి వీరు అంటే ఇష్టం ఉండదు.పరీక్షించాలని, నిందలు మోపాలని ఎదురు చూస్తువుంటారు.ఎందుకు ఇలా వుంటారు అంటే వీరికి దైవ భక్తి విశ్వాస్వాలకన్నా,లోకానికి సంబంధించిన వ్యవహారాలే ఎక్కువ కాబట్టి. హించించటానికి, అవమానించాటానికి, సంసిదముగా వున్నారు మొదటి పఠనపు వారు మరియు సువిశేషపు వారు కూడను.ఈ మొదటి పఠనపు వచనాలు అన్నియు కూడా యేసుక్రీస్తు వారితో వున్నా సంబంధమును తెలుపుతున్నాయి.
ఈ సంఘటన యూధుల ముఖ్యమైన పండుగ (Feast of Tebernacles ) సమయములో జరిగింది. ఈ ప్రత్యేకరోజున ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు అరణ్యములో నడిపించిన దానిని జ్ఞాపకపరుచుకుంటారు.ఈ సమయములో యేసుక్రీస్తు వారి గురించి విన్న వీరు,కోపంగ వున్నారు. ఆయనను చంపాలని వారు యత్నిస్తున్నారు.ఈ సన్నివేశం యేసుక్రీస్తు వారు జాగ్రత వహించిన దానిని కూడా సూచిస్తుంది. (25-27) వచనాలలో సమయం ఇంకా రాలేదనే బావన వుంది.అక్కడ వున్నా ప్రజలు ఆశర్యపడ్డారు.(28-29) వచనాలలో దేవుని నుండి వచ్చాడని స్పష్టముగా చెప్పుతున్నారు. ప్రమాదములో వున్నప్పటికిని దైర్యం కలిగిన దైర్యషీలి మన క్రీస్తు ప్రభువు.అప్పటి ప్రజలు అర్తం చేసుకోవటం మానేసి అపార్తం చేసుకోవటం మొదలు పెట్టారు. ఏమి నేర్పిస్తుంది ఈ వాక్యం దేవుని కార్యాలు లోతయినవి వాటిని, ఆ గమ్ముతును తెలుసుకోవాలి అంటే మనము క్రీస్తులో ఏకమవటం మంచిది అని తెలియటం లేదా,....
ప్రియులారా దేవుని వెంబదించినప్పుడు,నమ్మినప్పుడు, విశ్వసించి ఆయనతో నడిచినప్పుడు,మనకు ఆపహేళనలు, ఎగతాలులు,నిందలు,అపహాసాలు,హాస్యాలు,దూషబాషనాలు, మనపై వర్షపు జల్లులవలే పడటం సాధ్యం.నీతిమయమైన జీవితమును,దేవునితో సమాఖ్యమైన నడవడికను మనము కొనసాగిస్తున్నప్పుడు, సాటివారు ఓర్చుకోలేరు,జీర్ణించుకోలేరు,చూసి తట్టుకోలేరు. దుస్టుల స్వభావం, మార్చలేము,వారి గర్వపు విర్రవీగుతణమును మెరుస్తువుంటుంది.కానీ మనము ఇలా లోకము నిందిస్తుంది,ఎగతాళి చేస్తుంది అని విశ్వాసమును విడవకూడదు ప్రియులారా.ఆయనను వెంబదించటం అంతసులభతరం కాదు,కానీ దేవుడు అబయమిస్తున్నాడు, మీ బహుమానం అత్యున్నతప్రాముఖ్యమైనది, వర్ణింపలేని విధముగా దీవిస్తానని, కోరినదానికంటే అధికముగా చేయగలను అని, నిన్ను చూసి నవ్విన వారి చేతనే జేజేలు కొట్టిస్తానని,ఈరోజుటి వాక్యం మనందరితో మాట్లాడుతుంది.
యేసుక్రీస్తు ప్రభువులవారు,ఎంత కుట్ర తనపై వున్నా,చంపుతారని తెలిసిన, వెళ్ళకూడదని ఎరిగిన, తండ్రి చిత్తానికి తల వంచి ప్రణాళికలను ఈలోకములో మనకోసము నెరవేర్చిన గొప్ప కరుణాధాలుడు మన ప్రభువుల వారు. ప్రజలు తిరస్కరించిన పరీక్షించిన, బాధపెట్టిన,భయభంత్రులకు గురించేసిన ఆయన మాత్రం బయపడక కొనసాగించాడు తన పరిచర్యను.
దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితం,నీతిమంతుల జీవితం అంత సులువైనదికాదు,ఇది బెడ్ అఫ్ రోసెస్ కాదు,బెడ్ అఫ్ తొర్న్స్ మాత్రమే....... విశ్వాసం సన్నాగిళ్లకుండా, బలహీనపడకుండా, ప్రణాళికలో నడవగలిగిన నీకైనా,నాకైన,మనందరికీ అయినా ఆయన నిత్య సత్య సజీవ బహుమానమును ఇవ్వగలరు, ఆ బహుమానం నుంచి, ఎవరు కూడా వేరుచేయలేరు,విడదీయలేరు,విరుగగొట్టలేరు,మరియు నాశనం చేయలేరు,కావున ఈ తపస్కాల రోజులలో ప్రయాణిస్తుండగా అయన హెరాలమైన దీవెనల కుసుమాంజుల కోసం ఎదురు చూదాం,విశ్వాసములో రానిదాం.
