నిశ్శబ్ద సువార్తికుడు పునీత జోజప్ప

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

18 Mar 2026


ప్రియులారా ఈరోజున తల్లి శ్రీసభ పునీత జోజప్ప గారి పండుగను జరుపుకుంటుంది.ఈ పునీతుడు నాటి పురుషులకైతేనేమి,నేటి పురుషులకైతేనేమి,ముఖ్యముగా యువతీ యువకులకు ఒక మాదిరి.వీరి జీవితం ఎందరికో ఆదర్శనీయం.పాపము కళ్ళముందువున్న పాపము చేయని ఫున్యుడు.లోకాశలతో సతమతమవుతున్న లోకానికి తలవంచని భక్తుడు.విశ్వాసములో బలహీనపడని వాడు, దేవుని చిత్తానిపై అమితమైన ప్రేమను కనపరచ్చినవాడు. పవిత్రతకు పర్యాయపదం వంటివాడు.శాంతికి స్నేహితుడు, పవిత్రతకు పర్యాయపదం లాంటివాడు,మంచికి తనయుడు, మాటలచే కాక, కార్యములచే మాట్లాడిన వాడు,గుణగణాలు కలిగిన గుణవంతుడు.

A).యోసేపు గారు నీతిమంతుడు (మత్తయి 1:19)
అన్నివిధాలుగా,అన్నింటిలో నీతిమంతుడు.ఆయనను చూస్తే నీతిపరూలుగా మారాలనుకునే తత్వం మనలో పుడుతుంది. సత్యవంతుడు. అబద్ధాలు తెలియవు,మోసం తెలియదు, పన్నాగాలు తెలియవు,లోక పూరితం తెలియదు.నోవా వలె, అబ్రహం వలె,యోసేపు వలె సుగుణాల గొడుగు,నిత్య సత్య నీతిమయుడు.నిశ్శబ్ద పాలకుడు.

B).యోసేపుగారు పరిశుద్దతకు మరియు పవిత్రతకు మారుపేరు
దేవుని భయం, పాపం లో పడని,పాపమును ఎంటర్టైన్మెంట్ చేయని ఉత్తముడు మంచికి మాణిక్యం.(హెబ్రీ 12:14పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు).పాపం కోసం వెధకలేదు,పాపపు ఊబిలో పడలేదు.

C).యోసేపుగారు కష్టజీవి(మత్తయి 13:55)
శ్రమను నమ్ముకున్నవాడు,శ్రామికుడు,workaholic,ఇతను వడ్రంగి, కష్టించే వాడు,కష్టపడాడు తిరుకుటుంబం కోసం, కష్టముపై ఆధారపడినవాడు.

D)యోసేపు గారు ఓర్పుగల ఓరిమి
రహస్యముగా వదులుకోవాలని బావించిన ఆపని చేయని వాడు.బహు రమ్యమైన గుణం, నేటి సమాజములో నశించి పోతున్న ఈ ఓర్పు ఆయనలో అమితముగా ఉండేది.

E)యోసేపు గారు విధేయతకు పర్యాయపదము ( మత్తయి 1:20, 24, 2:13,19
దేవునికి,తిరుకుటుంబానికి వర్ణించలేనంత విధేయతను కనపరిచిన సౌమ్యుడు.మనము కూడ ఈయన వలె మన దేవునిపై,ఆయన ఆజ్ఞలపై విధేయతను కనపరచాలి,చుట్టూ వున్నా వారితో,విధేయతతో నడుచుకోవాలి. విధేయత మనలను దేవుని కీ ప్రియబిడ్డలుగా మారుస్తుంది. విధేయులు దేవునికి ప్రియులు.

F).యోసేపు గారు నమ్మకపాత్రుడు
ఇలా మనము వుంటున్నామా,సంరక్షకుడు,శైలి కలిగిన వాడు.దైర్యముగల నమ్మికస్తుడు,నమ్మకానికి నమ్మకం ఈ పునీతుడు

E) యోసేపు గారు దీనుడు
(మత్తయి 5:2 కు నిలువెత్తు నిదర్శనము )అహంకారం లేని ఆకర్షతుడు,గర్వం లేని గౌరవనీయుడు అన్నింటిలో దీనత్వమును కనపరిచే దీనశాలి.

ప్రియులారా ఈయన శ్రీసభ పాలకుడు,కుటుంబాల పోషకుడు,సాకుడు తండ్రి,యేసుక్రీస్తు మరియు మరియకు కావలి వాడు.విశ్వాసుల నాయకుడు.ఇలా చెప్పుకుంటే పోతే ఆయనకు ఎన్నో వర్తిస్తాయి.ఈయన జీవితం మాదిరి అయినది,మార్గం సంఖ్యత్తాయినది,సత్యమైన జీవితము, సన్నిహితుమైన బావము,నిర్మలమనహృదయం,ఇన్ని లక్షణాలు గలవాడు కాబట్టే తల్లి శ్రీసభ పునీత జోజప్ప గారిని శ్రీసభ పాలకుడిగ బోధిస్తుంది.కావున మనం అందరము ఈయన మధ్యస్థ ప్రార్తనను వేడుకుందాము,ఈయన సుగుణ లక్షణాలు మన జీవితాలలో కూడా పాటించాలని మనసారా ప్రార్తించుకుందాము.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN