పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
18 Mar 2026
తండ్రి కాని తండ్రి! ధరణి మెచ్చెడి తండ్రి!
తనయుని కనురెప్ప! మన హితుండు!
మరియ కావలి పతి! మర్యాద కధిపతి!
యోసెపు యిలలోన! యేసు తండ్రి!.
దేవుడిచ్చి నట్టి దివ్యమైన పనిని
రెప్ప వాల్చకుండ చేసినాడు!
అవని లోని తండ్రులెవరికైనను సదా
గొప్ప మాదిరి కద! జోసపు యన!.
దైవ చిత్తమన్న ఏనాడు మీరడు!
తనను నమ్ముకొన్న దారి చూపు!
పుణ్య పురుషుడైన! పూజ్యుడా! జోజప్ప!
వేల నుతులు నీకు! విమల మూర్తి!.
