యేసు వాక్యాన్ని విను – జీవాన్ని పొందు,

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

17 Mar 2026

తపస్కాల ఇరవై ఐదవ రోజు,బుధవారము,
మొదటి పఠనము : యెషయా 49:8-15
రెండవ పఠనము : యోహాను 5:17-30
యెషయా 49:15......”ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను”
ప్రియులారా యెషయా గ్రంధంలోని 40-50 అధ్యాయాలు “అశ్వాసన” గ్రంధాలు( Book of consolations )అని అంటారు.బాబులోనియాలో వున్నా ఇజ్రాయెల్ లకు ఆశ, ఆదరణ,మరియు విమోచనను తెలియజేస్తుంది.దేవుడు తన ప్రజలను ఎప్పటికి మరిచిపోడని,ఆయన సమయం వచ్చినప్పుడు విమోచన తద్యం అని,వచనాలు మనకు తెలుపుతున్నాయి.నిరాశలో ఆశను నింపేవాడు దేవుడు, నీ కళ్ళను ఆనందముగా మార్చేవాడు దేవుడు ప్రియా సహోదరి సహోదరుడ. మనము ఏ స్థితిలో వున్నా, నీ స్థితిని, నీ పరిస్థితిని బట్టి, నీవు, నేను, మనము దేవుణ్ణి మరిచిపోతామెమో కానీ,ఆయన మాత్రం మనలను మరువడు.జన్మనిచ్చిన తల్లితండ్రులు నిన్ను మరువవచ్చు, ఒకే రక్తముతో పుట్టిన తోబుట్టువులు మరువవచ్చు,నిన్ను ప్రేమించినవారు మరువవచ్చు,ఎవరు ఎవరినైనా మరువవచ్చు, విడువవచ్చు,మరిచిపోవచ్చు,కానీ,దేవుడు నిన్ను మరువడు,విడువడు మరియు ఎడబాయడు.దేవుని ప్రేమ,తల్లి ప్రేమ కంటే గొప్పది,నీ ప్రేయసి, ప్రియుని ప్రేమ కంటే గొప్పది,లోక ప్రేమకంటే ఎంతో గొప్పది.లోకం తాత్కాలికం, లోక మనుషులు తాత్కాలికం,అవసరాలను బట్టి రూపలను మార్చుకునే మనస్తత్వం ఈ మనష్యులకు వుందే కానీ దేవుని లేదు. ఆ ప్రేమకలిగిన దేవుడు,లోకమునకు నీకోసం వస్తే, నమ్మలేదు,విశ్వాసించలేదు మరియు పట్టించుకోలేదు.ఈనాటి సువిశేష పఠనములో దేవునితో ఏకత్వం కలిగిన దేవుడని,జీవమిచే వాడని,అధికారం గల వాడని,తీర్పు చెప్పే అధికారి అని పునరుతానం యొక్క నిత్య నిదర్శనం ఈయనే అనే తన వాక్కు,తన బాట,తన జీవిత సత్యవాక్కు ద్వార మనకు తెలియజేస్తున్నాడు.మనకోసం ఆయన దివినుండి భువికి వచ్చాడు.నిన్ను రక్షించుటకై, కాపాడుటకై,ప్రేమించుటకై మరియు నిన్ను సత్యములో నడిపించుటకై మరి ఆ ప్రేమను నీవు సధ్వినియోగపరుచుకుంటున్నావా లేక దుర్వినియోగం చేసుకుంటున్నావా.........

యోహాను 5:30......ఎలయన నేను నా ఇష్టానుసారముగా కాకా నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయుగోరుదును అని పలుకుచున్నాడు.యేసుక్రీస్తు వారు తండ్రి చితాన్ని పొల్లుపోకుండ పాటించిన క్రమశిక్షణ గల గొప్ప దేవుడు.ఆ గొప్పతనమును వర్ణించటం మనకు తగునా,మన జీవితం సరిపోవునా.... మనకోసం యుద్ధం చేసే, మాట్లాడే,మనకై నిలబడే, మనతో సాగే, దేవుడు మనకు ఉండగా మనకెలా భయము, మనకెలా చింత, అందుకే నీవు ఎప్పటికి ఒంటరి కాదు, ఎవరు లేరు,ఎవరు రారు,నా బ్రతుకు ఇంతే,నేనింతే, అని బాధపడకు ఆయన కరుణ,దయ,శాంతి ఎప్పుడు నీతోనే ఉంటాయి,నీ కొరకే ఉంటాయి.కావున నిర్లక్ష్యత్వముతో జీవింపక,ఆశతో జీవిదాం ఆయన వాక్యను సారము జీవిదాం, ఆయన మార్గములో నడుదాం అయన వెళలేని రక్షణను పొందుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN