నేటి పునీతుడు :పునీత సిరిల్ ఆఫ్ జెరూసలేం

ఫాదర్ ఆకుల ప్రసాద్

17 Mar 2026

సుగుణం: "సత్యోపదేశ పితామహుడు"

క్రీ.శ.315లో పాలెస్తీనాలోని జెరూసలేం నందు ఒక క్రైస్తవ కుటుంబంలో పునీత సిరిల్ గారు జన్మించారు..జెరూసలేం పీఠాధిపతులైన పునీత మాక్సిమానుగారిచే గురువుగా అభిషక్తులైనారు. క్రైస్తవ విశ్వాస ప్రబోధ సిద్ధాంతాన్ని చిన్నచిన్న ప్రశ్నల, సమాధానాల రూపంలో సత్యోపదేశం పేరిట ప్రజలకు నేర్పించిన మొట్టమొదటి గురువు పునీత సిరిల్ గారే. ఒక్కసారి వింటే గుర్తుండిపోయేలా స్పష్టంగా,సులభంగా, సమగ్రంగా చిన్న సత్యోపదేశాన్ని వీరు తయారుచేశారు.మాక్సీమనుగారి మరణానంతరం పునీత సిరిల్ గారు క్రీ.శ. 349లో జెరూసలేం బిషప్పుగా నియమించబడ్డారు.గొప్ప ప్రార్థనాతత్పరులైన వీరు దైవదర్శనాల ద్వారా జరుగబోవు వాటిని గురించి ముందుగానే తెలుసుకునే అనుగ్రహాన్ని పొందారు.క్రీస్తు నరుడే గాని దేవుడు కాదు అనే ఎరియన్ సిద్ధాంతం ఉచ్చులో పడి శ్రీసభఅస్తవ్యస్తమవుతున్న సమయంలో సత్యోపదేశ పితామహుడైన సిరిల్ గారు క్రీ.శ.315లో కాన్ స్టాంట్ నోపుల్ నందు జరిగిన క్రైస్తవ సార్వత్రిక మండలి సమావేశాలలో పాల్గొని క్రీస్తు త్రిత్వంలో ఒకరని,దేవుని ప్రత్యక్షరూపమే క్రీస్తని తన సాక్ష్యాన్ని ఘంటాపధంగా వినిపించి ఎరియన్ సిద్ధాంతాన్ని ఎండగట్టి కతోలిక శ్రీసభ సిద్ధాంతాలకు బలాన్ని చేకూర్చారు. అంతేగాక ఎరియన్ సిద్దాంతాలను బలపరిచిన వారినందరిని మరిముఖ్యంగా కైసరియా బిషప్పుయైన 'ఎకాషియసు' గారిని శ్రీసభనుండి బహిష్కరించారు. పునీత సిరిల్ గారు తమ 71వ ఏట క్రీ.శ.386లో పరలోకప్రాప్తినొందారు. శ్రీసభ వీరిని గొప్పపునీతులుగా ప్రకటించడమే గాక, క్రీ.శ. 1882లో 13వ లియో పోపుగారు సిరిల్ గారిని శ్రీసభ పండితునిగా ప్రకటించారు. సిరిల్ అనగా ప్రభువు, చక్రవర్తి, రాజు అని అర్ధం.

పునీత సిరిల్ గారా మాకొరకు ప్రార్ధించండి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN