అధికార దుర్వినియోగాన్ని నేను సహించను - పోప్

జోసెఫ్ అవినాష్

17 Mar 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV ఇటీవల జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలోని ఒకటైన పాంటిఫికల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ మైనర్స్( చిన్న బిడ్డల రక్షణ కోసం ఏర్పడిన ప్రత్యేక విభాగం) సమావేశంలో మాట్లాడుతూ,శ్రీసభ పిల్లలు మరియు బలహీన వర్గాల కోసం పూర్తిగా సురక్షిత స్థలంగా మారాలని స్పష్టం చేశారు.దుర్వినియోగం ఘటనలపై నిర్లక్ష్యం అసలు సహించరాదని,బాధితుల స్వరాన్ని వినడం మరియు వారికి న్యాయం చేయడం శ్రీసభ యొక్క ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చిన్న బిడ్డల రక్షణ కోసం ఏర్పడిన ఈ ప్రత్యేకమైన విభాగం స్వతంత్రంగా పనిచేస్తూ నిజాలను ధైర్యంగా బయటపెట్టాలని,అలాగే పారదర్శకత మరియు బాధ్యతాయుత వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.ఈ విధంగా భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోప్ పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN