మంత్రి శ్రీ నారా లోకేశ్‌తో కతోలిక పీఠాధిపతులు భేటీ

జోసెఫ్ అవినాష్
17 Mar 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ,విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ.నారా లోకేష్ గారిని తెలుగు కతోలిక పీఠాధిపతుల మండలి ఇటీవల కలిసి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.ఈ భేటీలో కడప, కర్నూలు,నెల్లూరు,గుంటూరు,విజయవాడ,ఖమ్మం,ఏలూరు పీఠాల పీఠాధిపతులు,కొందరు గురువులు పాల్గొని, కతోలిక దేవాలయాలకు సంబంధించిన భూముల సమస్యలను వివరించారు.ఈ సమస్యలు గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని వారు తెలియజేశారు.అదేవిధంగా,తమ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల గురించి వివరించి,వాటిని సందర్శించాలని మంత్రిని ఆహ్వానించారు.దీనికి స్పందించిన మంత్రి లోకేశ్,ఈ సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే ప్రభుత్వం మరియు శ్రీసభ కలిసి విద్యా రంగంలో,సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది.
