యేసయ్యే మన నిరాశలో ఆశ

బ్రదర్ టోనీ నాగిపోగు MSC

16 Mar 2026

తపస్కాల 24వ రోజు
మంగళవారము
మొదటి పఠనము :యెహెఙ్కేలు 47:1-9,12
సువిశేష పఠనము : యోహాను 5:1-16
ప్రియులారా యెహెఙ్కేలు ప్రవక్త బబులోను చెరలో వున్నప్పుడు దేవుని దర్శనాలను పొందాడు.క్రీస్తుపూర్వం సుమారు 597-571 మధ్యకాలములో ఆయన ప్రవచించాడు. ఇజ్రాయెల్ ప్రజలు తమ పాపాలు కారణముగా బబులోనుకు చెరలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారిని దైర్యపరచడానికి మరియు భవిష్యత్తు లో ఇచ్చే పునరుద్దరణను చూపించడానికి ఈ ప్రవక్త ద్వారా కొన్ని దర్శనాలను ఇచ్చాడు.
1).ఆలయం నుండి ప్రవహించే నీటి దర్శనం....... ఇది దేవుని కృప ఆశీర్వాదo మరియు జీవాన్ని సూచిస్తుంది.

2).మృత సముద్రానికి జీవం........ ఇది ఇది దేవుని శక్తి చనిపోయిన దానికి జీవం ఇవ్వగలదు అని తెలియజేస్తుంది. దేవుని కృప మనుషుల జీవితాలను మార్చాగలదని చెప్పుతుంది.

3).నది ఒడ్డున వున్నా వృక్షాలు..... ఇది దేవుని ఆశీర్వాదం ఎప్పటికి తగ్గదని సూచిస్తుంది.

ప్రియులారా ఈదర్శనాలకు మరియు సువిశేష పఠన స్వస్థత కు చాలా సంబంధం వుంది.ఈ జలాలు దేవుని కృపలు,దేవుని అద్భుతాలు,దేవుని గొప్ప కార్యాలకు చిహ్నలు మరియు దేవుని అమితమైన కార్యాలకు నిదర్శనాలుగా వున్నాయి. యోహాను 5:8......లెమ్ము నీ పడకను ఎత్తుకుని నడువుము అని అనెను. తన నిరాశను,అసహయతను,బలహీనతను, కష్టమును,రోధనను,వేదనను, భరించలేనటువంటి బాధను, ఎవరికి చెప్పుకోలేనంత తన అంతర్గత మనో నరకాన్ని,38 ఏళ్ళ కఠోర బాధను మరియు కంటినిండా నీరు,గుండెనిండా బాధ,విరిగిన మనస్సు,పగిలిన జీవితం, అందరూ వున్నా ఒంటరివాడై వున్నా తను ఒక్కసారిగా ఆమాటను వినగానే స్వస్థత పొందాడు 38 ఏళ్ళ బాధ... కనుమరుగయ్యే, ఆనందబాస్పాలా ప్రవాహం పొండిపోరలే,దేవుని ప్రేషిత కృప ప్రవాహం ఈ వ్యక్తి రూపములో కదిలాడే,మనలో ఆ ప్రవాహం ఎల్లప్పుడూ పారుతూనే ఉండాలి.నీవు ఎండిపోతున్నావా,నీ కుటుంబం,business, విశ్వాసం,భక్తి, నీ క్రియలు,ఎండిపోయి ఉన్నాయా,ఎండి పోతున్నాయా,బయపడకు,ప్రవహించే యేసుక్రీస్తు కృప నీలో ఉండగా భయమేల,నీవు కూడా అవ్యక్తి వలె వున్నా చోటనే ఉండకుండా,ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాకుండా లేయి..... ముందుకు సాగు,ముందుకు నడువు,ముందుకు నడవాలని ప్రయత్నం చెయ్...కచ్చితముగా మారుతుంది నీజీవితం.పునీత ఆగస్తేన్ గారు........ ఎండిన జీవితము నుండి పలించే ఆ జీవపు ప్రవాహములో కృపను పొందాడు.పునీత మేరీ అఫ్ ఈజిప్ట్...నిజమైన పచ్చతాపాన్ని పొంది ఆశీర్వాద కరమయిన ప్రవాహములో ప్రవహించింది.కావున మనము కూడా ఆశ కలిగి, జీవం గల కృప ప్రవాహం మనలో కూడా ప్రవహించి, మనకు నూతనమైన జీవితమును అనుగ్రహించాలని మన ప్రభువును వేడుకొందాము.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN