“విశ్వాసం మన కళ్లను తెరుస్తుంది” - పోప్
జోసెఫ్ అవినాష్
16 Mar 2026
తప:కాల 4వ ఆదివారం సందర్భంగా జగద్గురువులు పోప్ లియో XIV ఆంజెలస్ సందేశంలో క్రీస్తు పుట్టుకతోనే అంధుడైన మనిషిని స్వస్థపరచిన సువార్త సంఘటనను గుర్తుచేశారు.ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.చాలా సార్లు మనుషులు కళ్లతో చూసినా దేవుని నిజాన్ని మరియు ఇతరుల బాధను గుర్తించలేక ఆధ్యాత్మికంగా అంధులుగా ఉంటారు.కానీ యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు మన హృదయాలు తెరుచుకుంటాయి. అప్పుడు మనం దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాము మరియు ఇతరుల కష్టాలను కూడా గుర్తించి వారికి సహాయం చేయాలని అనుకుంటాము.అందుకే నిజమైన విశ్వాసం అంటే కళ్లను మూసుకుని నమ్మడం కాదు,దేవుని వెలుగులో ప్రపంచాన్ని సరిగా చూడడం అని పోప్ చెప్పారు.
