విశ్వాస కుటుంబాలకు ఆశీర్వాదం ఉంటుంది

బ్రదర్ టోనీ నాగిపోగు MSC
15 Mar 2026
ప్రియులారా దేవునిలో నిజమైన ఆనందం ఉంటుంది. దేవునిలో క్రొత్త ఆశ ఉంటుంది.క్రొత్త అవకాశం ఉంటుంది.మొదటి పఠనము ను మనము ధ్యానం చేస్తే ఎనిమిదవ శతబ్దాములో యూదా రాజ్యములో సేవ చేసిన గొప్ప ప్రవక్త యెషయా గారు.ఎందుకు ఆయన నూతన దివిని, నూతన భువిని అని బోధించాడు అంటే (యె 65:17), ఈ యూదా ప్రజలు దేవుని మార్గం విడచి,విగ్రహారాధనకు మరియు అన్యాయమునకు బానిసలాయ్యారు.ఇలా జీవిస్తున్న వీరి జీవితాలలో కష్టాలు,యుదాలు,బంధీపోటు పరిస్థితులు వచ్చాయి.అటువంటి సందర్బంలో యెషయా ప్రవక్త వారికి ఒక నూతనమైన అవకాశమును,ఆశను వారి ముందు వుంచుతున్నాడు.ఇది ఇలా ఉంటే..... ఎవరు ఈ యూదా ప్రజలు సాక్షాత్తుగా దేవునిచ్చే ఎన్నుకోబడిన వారు, కానీ వెనుకబడిపోయారు, ఎన్నికలేని వారు విశ్వాసులై రక్షణ అద్భుతాలను తమ జీవితములో చవి చూస్తున్నారు.ఎవరు ఈ ప్రభుత్వ ఉద్యోగి ( Herod Antipas )యొక్క అధికారిగా వుండే వ్యక్తి కాపార్నాము గలీలియా సముద్ర తీరములో వున్నా ప్రముఖ పట్టణం,ఆ పట్టణములో తన కుమారుడికి తీవ్రమైన జ్వరముతో మరణ దిశలో వున్నాడు.అన్యుడు, మొదటి పఠనపు ప్రజలు యూధులు,వీరి పూర్వికులు ధర్మశాశ్రమును తూచ తప్పకుండా పాటించిన వారు.ఈ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం (యోహాను 4:49) లో రండు అని వేడుకొనుచున్నాడు. అద్భుతకారుడు,ఆశర్యాకరుడు,అందరివాడు అయినా మన క్రీస్తు ప్రభువులవారు 50,నీవు వెళ్ళుమూ,నీ కుమారుడు జీవించునని అద్భుతకరమైన తన మాధుర్యముగల మాటల పదజాలముతో చెప్పగనే,తలవంచి,విశ్వశించి,జరుగుతుంది అని బలముగా నమ్మి,ఇంటికి వెళ్లుచుండగా,ఆ వ్యక్తి కుటుంబం లో అద్భుతం జరిగింది.తాను తన కుటుంబం, విశ్వాసించారు,మేల్కొన్నారు,మేల్కొబాడారు,నిజమైన దేవుణ్ణి కనుగొన్నారు సత్యాన్ని గ్రహించారు.దృదమైన విశ్వాసముతో 53,యేసును విశ్వాసించారు.ఆ ప్రభుత్వ ఉద్యోగిది బలమైన విశ్వాసం,దృదమైన నమ్మకం,ఏమైనా చేయగలడు,నా కుటుంబములో నూతనమైన,జీవితం వస్తది, స్వస్థత చేకూరాబడుతుంది అని విశ్వాసముతో ముందడుగు వేసాడు,నవ్యకిరణాల అరునోదయ కిరణాలు వేదజలబడ్డాయి.యూదుల విశ్వాసం బలహీనపడుతూ వస్తుండగా అన్ని రకాల వెధనలలో కూరుకుపోయారు,ఈ ఉద్యోగి విశ్వాసం బలపడుతూ వస్తుండగా,ఆనందం నాట్యం చేస్తూ వచ్చింది.ఏమి తెలుపుతుంది ఈనాటి సందేశం, నమ్మకమును, విశ్వాసమును బలపరిచలికాని,అహంకారమైన తెలివితేటలను కాదని అర్తం కావటం లేదా, కావున ఈ అనుగ్రహ కాలములో వున్నా మనకు విశ్వాసం పెరగాలని,బలపడాలని,ఆ ప్రభుత్వ ఉద్యోగి వలె సంతోషాగానముతో ఆయనను వెంబదించాలని ధ్యానం చేసుకుందాము , మన కుటుంబాలు కూడా ఆశీర్వాదముగా మారాలని ప్రార్తించుకుందాము.(హెబ్రీ 11:6, తన వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చునని విశ్వాసింప వలెను).
