“సత్యం, ప్రేమతో నడిచే న్యాయం కావాలి”- పోప్

జోసెఫ్ అవినాష్

14 Mar 2026

వాటికన్ న్యాయవ్యవస్థ సంవత్సర ప్రారంభ సందర్భంగా న్యాయమూర్తులు మరియు న్యాయ విభాగంలో పనిచేసే వారికి విశ్వ కాపరి పోప్ లియో XIV సందేశం ఇచ్చారు.శ్రీసభలో న్యాయం అనేది కేవలం చట్టాలను అమలు చేయడం మాత్రమే కాదని,అది దేవుని ప్రజలకు చేసే ఒక ముఖ్యమైన సేవ అని ఆయన చెప్పారు.న్యాయమూర్తులు నిజాయితీగా,నిష్పాక్షికంగా పనిచేయాలని,ప్రతి వ్యక్తికి తనను తాను రక్షించుకునే హక్కు కల్పించాలని ఆయన గుర్తుచేశారు. అలాగే న్యాయ ప్రక్రియలు ఎక్కువకాలం ఆలస్యం కాకుండా త్వరగా,సత్యంతో పూర్తికావాలని సూచించారు.సరైన న్యాయం సమాజంలో విశ్వాసాన్ని పెంచుతుందని,ప్రజల మధ్య ఐక్యతను బలపరుస్తుందని ఆయన తెలిపారు.న్యాయం ప్రేమతో కలిసినప్పుడు మాత్రమే అది నిజమైన క్రైస్తవ సేవగా మారుతుందని పోప్ పేర్కొన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN