నేటి పునీతులు : పునీత మెటిల్డా (క్రీ.శ.895-968)

ఫాదర్ ఆకుల ప్రసాద్

13 Mar 2026

సుగుణం: "ప్రేమాన్విత తల్లి”

రాజవంశానికి చెందిన మెటిల్డా గారు క్రీ.శ. 895లో జర్మనీ దేశంలో జన్మించారు.చిన్ననాడే తండ్రిని కోల్పోయిన వీరు తల్లి సంరక్షణలో దైవవిషయాలపట్ల ఆసక్తితో పెరిగారు. జర్మనీలోని 'ఏర్ ఫర్డ్' నందు వున్న ఒక కాన్వెంట్ లో మెటిల్డా గారు విద్యను, క్రైస్తవ నడవడికను పొంది క్రీ.శ. 919లో తన 14వ ఏట 'సాగ్ జోనీ' కి చెందిన యువరాజు హెన్రీని వివాహమాడారు.ఈ హెన్రీగారే జర్మనీకి రాజై అనేక రాజ్యాలను జయించి వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తన విజయాల వెనుక తన భార్యయైన మెటిల్డా పవిత్ర ఆచరణలు, ప్రార్ధనలు బలంగా వున్నాయని హెన్రీరాజు బహిరంగంగా చెప్పేవాడు.మెటిల్డా గారు రాజభవనంలో ఒక మఠవాసినిగానే జీవించేవారు.రాజభవనంలో పనిచేయువారినందరిని ఆమె ఒక ప్రేమాన్విత తల్లిగా ఆదరించేవారు. హెన్రీరాజు మరియు మెటిల్డా గార్లు తమ అధికార పరిధిని దాటి దైవరాజ్య విస్తరణకై, న్యాయచట్టాల అమలుకై శ్రమించడమేగాక పీడితులను, పేదలను గొప్పగా ఆదుకొన్నారు.తన 41వ ఏట భర్తను కోల్పోయిననూ మెటిల్డాగారు ఇంకా రెట్టింపుగా ప్రార్థనలను, త్యాగకృత్యాలను, దానధర్మాలను చేస్తూ అనేక ఆసుపత్రులు, దేవాలయాలు, బెనడిక్టు సన్యాసుల మఠాలను నిర్మించారు. మెటిల్డా గారి సేవలను ఆమె కుమారులైన ఒట్టో, హెన్రీలు అభ్యంతరం తెల్పుతూ ఆమెను రాజభవనం నుండి బహిష్కరించి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. చేసిన పాపం కష్టాల పాలుచేయగా వారు తమ తప్పుకు పశ్చాత్తాపం చెంది తల్లిని క్షమాపణకోరి తిరిగి ఆమెకు రాజప్రాసాదంలో గౌరవస్థానాన్నిచ్చారు.మెటిల్డాగారి పెద్దకుమారుడు జర్మనీకి, చిన్నకుమారుడు బవేరియా రాజ్యానికి రాజులవగా, మరొక కుమారుడైన బ్రూనో గారు పునీతునిగా కీర్తింపబడ్డారు. క్రీ.శ. 9%ళిలో మార్చి 14న మెటిల్డా గారు 'క్వెడ్ లిన్ బర్గు' మఠాలయంలో పరలోకప్రాప్తినొందారు. జర్మనీ భాషలో మెటిల్డా అనగా వీరనారి అని అర్ధం.

పునీత మెటిల్డా గారా మాకొరకు ప్రార్ధించండి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN