A-Ω(ఆల్ఫా- ఒమేగా) అక్షరాల భావం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

13 Mar 2026

ఆల్ఫా (A) ఒమేగా ( Ω) అనే ఈ రెండు అక్షరాలు గ్రీకు అక్షరాలు.ఆ భాషలోని అక్షరక్రమంలో మొదటిదీ, చివరిదీ అయిన ఈ అక్షరాలను ఆరంభాన్ని, అంతాన్ని సూచించడానికి వాడేవారు (A to Z అని ఇంగ్లీషులోని అక్షరాలను ఉపయోగించినట్లు) ఆది, అంతము అనే భావం ఇందులో కనుపిస్తుంది.ఈ రెండు అక్షరాల పోలికలో,క్రీస్తుప్రభువు ఆదియు, అంతము అయినవాడు అని అన్వయం చేసేవారు.దర్శన గ్రంధంలో యేసుక్రీస్తునుద్దేశించి ఈ అక్షరాలు గురుతును ఇలా వాడారు "ఆల్ఫా ఓమేగా నేనే... సర్వశక్తిమంతుడను, భూతభవిష్యద్వర్తమానము. లందున్న ప్రభువునైన దేవుడు నేనే" (దర్శన 1:8). మొదటి క్రైస్తవ సంఘంలో ఈ అక్షరాలు ప్రస్తావన ప్రాచుర్యంలో ఉండేది. గ్రీకు భాష అప్పటికి ప్రసిద్ధి చెందిన భాష పండిత పామరులకు పరిచయమైన భాష.యేసుక్రీస్తు ఆదిసంభూతుడని, అంత్యములో రానున్న వాడని సూచిస్తూ,సమాధుల మీది (Catacombs), గోడల మీద వ్రాసుకునేవారు.సాధారణంగా ఈ రెండక్షరాలు సిలువలో కనుపిస్తాయి. కొన్నిచోట్ల క్రీస్తు పేరుకు సూచికలయిన Chi-Rho(☧)లతోను ఇంకా ఇతర క్రైస్తవ చిహ్నాలతోనూ కనుపిస్తాయి.యేసుక్రీస్తు, కాలపరిణామానికి అతీతుడని, అప్రమేయుడని, మొదటి నుండి ఉన్నవాడని, అంత్యకాలమున రానున్నవాడనీ అన్నభావాన్ని సూచించే ఈ అక్షరాలు, పాస్కావత్తి మీద ప్రస్తుత సంవత్సరంతోబాటు కనుపించడం విశేషం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN