తిరు కుటుంబాన్ని చూసి నేర్చుకుందాం - పోప్

జోసెఫ్ అవినాష్

13 Mar 2026

వాటికన్‌లో జరిగిన “ఆతిథ్య సభ”లో విశ్వ కాపరి పోప్ లియో XIV మాట్లాడుతూ,క్రైస్తవ జీవితంలో ఇతరులను స్వాగతించడం (Hospitality)చాలా ముఖ్యమని చెప్పారు.ప్రతి క్రైస్తవ సమాజం ఇతరులను వినడం,అర్థం చేసుకోవడం,సహాయం చేయడం ద్వారా నిజమైన సమైక్యతను నిర్మించాలి అని ఆయన వివరించారు.పోప్ ముఖ్యంగా యువతపై దృష్టి పెట్టారు.సమాజం మరియు శ్రీసభ భవిష్యత్తు యువతలోనే ఉందని,వారిని స్వాగతించడం అంటే వారి మాటలను వినడం,వారి సమస్యలను అర్థం చేసుకోవడం అని చెప్పారు.యువతలో దేవుని ఆత్మ ఇంకా పనిచేస్తూనే ఉందని,అందువల్ల శ్రీసభ వారితో కలిసి నడవాలి అని ఆయన చెప్పారు.ఇతరుల జీవితంలో మనం భాగంగా ఉండటం అంటే వారితో సమయం గడపడం,వారికి తోడుగా నిలవడం.అలాగే శ్రద్ధ చూపడం అంటే వారి జీవితానికి బాధ్యతతో సహాయం చేయడం.ఈ రెండూ కలిసే నిజమైన క్రైస్తవ ఆతిథ్యానికి మూలం అని ఆయన చెప్పారు.పోప్ తిరు కుటుంబాన్ని ఉదహరిస్తూ,ముఖ్యంగా పునీత జోజప్ప గారు ఇతరులను కాపాడే బాధ్యత మరియు ప్రేమకు గొప్ప ఉదాహరణ అని చెప్పారు.ఆయనలాగా మనమూ ఇతరులను స్వాగతించి, జాగ్రత్తగా చూసుకోవాలని పోప్ ప్రోత్సహించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN