శ్రీసభ ద్వారాలు అందరికోసం తెరిచి ఉంచాలి - పోప్
జోసెఫ్ అవినాష్
12 Mar 2026
యేసుక్రీస్తును విశ్వసించేవారందరూ ఒకే కుటుంబానికి చెందినవారని.వారి భాష, జాతి,దేశం వేరైనా క్రీస్తులో అందరూ ఒకటేనని బుధవారం జనరల్ ఆడియన్స్ సందర్భంగా పోప్ స్పష్టం చేశారు.రెండవ వాటికన్ కౌన్సిల్ పత్రం అయిన Lumen Gentium గురించి పోప్ ప్రసంగించారు.ఈ పత్రం ప్రకారం శ్రీసభ ద్వారాలు కొందరి కొరకు కాకుండా అందరి కోసం తెరిచి ఉంచాలని స్పష్టం చేస్తున్నదని పోప్ తెలియపరిచారు.చర్చి ఒక సంస్థ కాదని అది అందర్నీ దేవుని గృహంలో కలిపే కుటుంబమని ఆయన తెలియపరిచారు.దేవుడు తన పిల్లలందరినీ ఐక్యత మరియు శాంతిలో జీవించమని పిలుస్తున్నాడు.ఈ కారణంగా చర్చి ప్రపంచంలో ఉన్న విభేదాలు,యుద్ధాలు మధ్యలో కూడా దేవుని శాంతిని ప్రకటించే ఒక ప్రవచన సూచికగా నిలుస్తుందని పోప్ ఆశాభావం వ్యక్తపరిచారు.
