చర్చి నిధుల దుర్వినియోగ ఆరోపణలు:అమెరికా బిషప్ రాజీనామాను అంగీకరించిన పోప్

జోసెఫ్ అవినాష్

11 Mar 2026

అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఒక కతోలిక పీఠానికి చెందిన పీఠాధిపతి చర్చికి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో, జగద్గురువులు పోప్ లియో XIV ఆయన రాజీనామాను అంగీకరించారు.ఎమ్మానుయేల్ హనా షలేటా అనే ఈ బిషప్‌పై చర్చికి చెందిన సుమారు 2.7 లక్షల అమెరికా డాలర్లు (దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా) అక్రమంగా వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న సెయింట్ పీటర్ కల్దేయన్ కతోలిక పుణ్యక్షేత్రానికి సంబంధించిన నిధుల విషయంలో వెలుగులోకి వచ్చింది.ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తూ తాను ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. విచారణకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన సమర్పించిన రాజీనామాను పోప్ స్వీకరించినట్లు వాటికన్ ప్రకటించింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN