పిలుపులోని మెలిక యెఱిగి పొమ్ము!.
డా. కల్లూరి ఆనందరావు
10 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
పిలువదలచు కొనని పిలుపులనేకాలు!
పిలిచి పిలువనట్లు పిలుపులుండు!
నోరు పిలుచుచుండు!నొసలు వద్దనుచుండు!
పిలుపులోని మెలిక యెఱిగి పొమ్ము!.
