జీవితకాలంలో ఒకే ఒక్కసారి స్వీకరించే దివ్యసంస్కారం ఏమిటి?

కతోలిక శ్రీసభ సత్యోపదేశం

10 Mar 2026

జ్ఞానస్నానం,పవిత్రాత్మ ధ్రువీకరణం,గురుపట్టాభిషేకం (యాజకాభిషేకం)దివ్యసంస్కారాలు క్రైస్తవుడి ఆత్మమీద చెరిగిపోని గుర్తును ముద్రిస్తాయి.జ్ఞానస్నానం,ధ్రువీకరణసంస్కారాలు క్రైస్తవులను దేవుని సంతానంగాను,క్రీస్తు ప్రతిరూపాలుగాను మార్చివేస్తాయి.అదే విధంగా గురుపట్టాభిషేకం కూడా ఆయా వ్యక్తులపై శాశ్వత ముద్రను వేస్తాయి.ఈ సంస్కారాలను మరల మరల ఆచరించే అవకాశం లేదు. (1121)

ఒక బిడ్డ ఏ విధంగా తన తల్లిదండ్రులకు ఎప్పటికీ (శాశ్వతంగా) బిడ్డగానే ఉంటాడో,అదే విధంగా జ్ఞానస్నానం,పవిత్రాత్మ ధ్రువీకరణ సంస్కారాలను ఆచరించిన వ్యక్తి ఎప్పటికీ (శాశ్వతంగా) దేవుని బిడ్డ అవుతాడు.అంతేకాదు జ్ఞానస్నానం,పవిత్రాత్మ ధ్రువీకరణసంస్కారాలు పొందిన వ్యక్తి దేవుని కుమారుడు కావడంతోపాటు,క్రీస్తును పోలినవాడవుతాడు,శ్రీసభలో సభ్యుడవుతాడు.అదేవిధంగా గురుపట్టం సుస్ధిరమైన దేవుని కృపావరం.గనుకనే గురుధర్మం పదవీవిరమణతో ముగిసే వృత్తిధర్మం కాదు,గురుపట్టం శాశ్వతమైనది.గనుకనే ఈ దివ్యసంస్కారాలను ఒకేసారి ఆచరింపజేస్తారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN