తపస్సుకాల ఆచరణ పునీత బెనెడిక్ట మాటల్లో

జోసెఫ్ అవినాష్
10 Mar 2026
బెనెడిక్ట గారు మఠవాసులను ఉద్దేశించి తపస్సు కాలంలో
పాటించవలసిన కొన్ని నియమాలను గురించి 49 అధ్యాయంలో ఈ విధంగా తెలియజేసారు.'ప్రతి మఠవాసికి జీవితమంతా ఒక తపస్సు కాలం వంటిది.ఈ కాలంలో ప్రతి ఒక్కరు తమ జీవితాలను పరిశుద్ధతతో జీవిస్తూ అంతకు మునుపు నిర్లక్ష్యంతో చేసిన తప్పుల నుండి ప్రక్షాళితం కావాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కన్నీటి ప్రార్థన,పరిశుద్ధ గ్రంథ పఠనానికి పరిత్యాగ జీవితానికి ఎక్కువ సమయాన్ని భక్తిప్రపత్తులతో అంకితం చేయాలి.ఈ రోజుల్లో అలవాటుగా చేసే ప్రార్థనకు. ఉపవాసాన్ని జోడించి,దేవునికి సంతోషంగా అర్పించుకొని,పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆనందాన్ని పొందాలి (1 తెస్స 1:6)ఆధ్యాత్మిక తృష్ణతో రాబోవు ఉత్తన పండుగను చిత్తశుద్ధితో ఈ త్యాగాలను నెరవేర్చాలి.బెనెడిక్ట్ గారు బోధించిన ఈ తపస్సుకాల ఆచరణలలో ఎంతో అధ్యాత్మిక,ప్రగాడమైన భక్తి కనిపిస్తుంది.వీటన్నిటిని చిత్తశుద్ధితో నెరవేర్చాలన్నదే వారి బోధన ఇది కేవలం మఠవాసులకే కాకుండా ప్రతి క్రైస్తవునికి వర్తిస్తాయన్నదే నా భావన.
