బైబిలు ఎందుకు చదవాలి?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
09 Mar 2026
పరిశుద్ధత్మా చేత ప్రేరేపించబడినది కావున, సాక్షాత్తు బైబిలు, దేవుని వాక్యము.అందులోని గాఢతను,నిక్షిప్తమైన ఆధ్యాత్మికనిధులను తెలుసుకొమ్మని అది పాఠకులను ప్రేరేపిస్తుంది.బైబిలు అందరికి, అన్ని సందర్భాలలో,అన్ని సమయాలలో,అన్ని ప్రదేశాలలో ఏదొక ప్రేరణను, శక్తిని కలిగిస్తుంది.
ఉదాహరణకు ఈ క్రింది వచనాలు చదవండి :
ప్రమాదకర పరిస్థితులలో - కీర్తన 16,31,38, 2 పేతురు 2:9
వ్యాధి బాధలలో- మత్తయి26:39
భయముకలిగినపుడు- మత్తయి 10:16-31
1.ప్రపంచంలో కోట్లాది ప్రజలకు ప్రేరణ కలిగించి, సన్మార్గానికి దారి చూపిన దైవ గ్రంథం బైబిలు.
2. బైబిలును ఆధ్యాత్మిక పరిపుష్టికి,విషయపరిజ్ఞానానికి జ్ఞాన సముపార్జనకు, సత్ప్రవర్తనా బోధన కోసం, మంచిచెడుల నైతిక జీవన విధానం కోసం చదవాలి. మనిషి కోసం దేవుడు పొందుపరిచిన ఆజ్ఞలు అందులో వివరించబడి ఉన్నాయి.
3. దేవుని వాక్యాన్ని విశ్వసించడమంటే నిత్యజీవనాన్ని పొందినట్లు (యోహాను 4:1-24).
4.బైబిలు మనకంటే ముందువెళ్ళిన పితామహుల చారిత్రక కథా సంకలనం. వారిని దేవుడు కష్ట సమయాల్లో కూడా నిత్యసంతోషానికి నడిపిన తీరు అందులో నిక్షిప్తమై ఉంది. అది దేవునికీ, మనిషికీ మధ్య జరిగిన ఒప్పందాలను, అవి మన పితాపుత్రుల నుండి మనకు సంక్రమించే తీరును వివరిస్తుంది.
5.బైబిలుయెడల అజ్ఞానము, దేవుని యెడల అజ్ఞానానికి దారి తీస్తుంది అంటారు, పునీత జెరోమ్ గారు("Ignorance of Scriptures is the ignorance of God"). బైబిలును పఠించకపోతే దేవుని గురించి తెలుసుకోలేం. దేవుడులేని జీవితం గాలి లేని బుడగలాంటిది, జీవంలేని శరీరంలాంటిది. దైవవాక్య పరిజ్ఞానం లేని వారికి దైవసాన్నిధ్యం కూడా దుర్లభమే!
