మన ఆత్మ దాహాన్ని తీర్చేది యేసుక్రీస్తే: పోప్

జోసెఫ్ అవినాష్

09 Mar 2026

తపస్సుకాల 3వ ఆదివారం సందర్భంగా జగద్గురువులు పోప్ లియో XIV సువిశేష సందేశాన్ని అందించారు.యోహాను సువార్తలోని సమరియా స్త్రీతో యేసుక్రీస్తు సంభాషణను గుర్తుచేశారు.ప్రతి మనిషి హృదయంలో ఒక ఆత్మీయ దాహం ఉంటుందని,ఆ దాహాన్ని నిజంగా తీర్చగలిగేది యేసుక్రీస్తే అని ఆయన చెప్పారు.క్రీస్తును కలిసినప్పుడు మనలో నిత్యజీవానికి ప్రవహించే “జీవజలం” ఉద్భవిస్తుందని ఆయన వివరించారు.తపస్సుకాలం మన జీవితాన్ని పరిశీలించి దేవునికి దగ్గరవ్వడానికి ఒక అవకాశమని,మన హృదయంలో దేవుని కృపకు అడ్డుగా నిలిచే స్వార్థం,పాపం వంటి వాటిని తొలగించుకోవాలని పోప్ పిలుపునిచ్చారు.సమాజంలో తక్కువగా భావించబడిన సమరియా స్త్రీతో యేసు ప్రేమతో మాట్లాడినట్లే,క్రైస్తవులు కూడా ప్రతి వ్యక్తిని గౌరవంతో,ప్రేమతో చూడాలని ఆయన సూచించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN