గెలుపు పొందు వరకు పోరు సలుపు!.

డా. కల్లూరి ఆనందరావు
08 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
పడుతు లేచి నడచు పసివారి యత్నమ్ము
పరుగులెత్తు వరకు జరుగు చుండు!
ఓడిపోతి ననుచు ఊరకుండుట తప్పు!
గెలుపు పొందు వరకు పోరు సలుపు!.
