అమృతవాణి భవిష్యత్తు ప్రణాళికలపై పాలకమండలి సమావేశం

జోసెఫ్ అవినాష్
08 Mar 2026
మార్చి 7వ తేదీన తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య సేవా విభాగాలలో ఒకటైన అమృతవాణి సంస్థలో పాలకమండలి మరియు సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అమృతవాణి పాలకమండలి అధ్యక్షులు మహా పూజ్య పొలిమెర జయరావు గారు (ఏలూరు పీఠాధిపతులు), ఉపాధ్యక్షులు మహా పూజ్య రాయరాల విజయకుమార్ గారు (శ్రీకాకుళం పీఠాధిపతులు)డైరెక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ ఫా.పప్పుల సుధాకర్,తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య డిప్యూటీ సెక్రటరీ ఫా.రాజు అలెక్స్,ఫా.లూర్ధురాజు (సీఈఓ, దివ్యవాణి టీవీ)తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కడప పీఠాధిపతులు మహా పూజ్య సగినాల పాల్ ప్రకాశ్ గారు,నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం ధమన్ కుమార్ గారు,ఖమ్మం మేత్రాసన ప్రొక్యూరేటర్ ఫా. ఐజాక్ సూరేపల్లి గార్లను అమృతవాణి పాలకమండలి నూతన సభ్యులుగా ఎన్నుకున్నారు.అదేవిధంగా పాలకమండలి సభ్యులైన ఫా.గాలి విన్సెంట్ రెడ్డి గారు మరియు ఫా.స్టానిస్లాస్ SJ గారు అమృతవాణి కార్యక్రమాలు,వాటి విస్తరణ మరియు భవిష్యత్తు ప్రణాళికలపై ప్రత్యేకంగా చర్చించి తమ సూచనలు తెలియజేశారు.ఈ సమావేశంలో అమృతవాణి సేవలను మరింత విస్తరించి విశ్వాసులకు ఆధ్యాత్మికంగా ఉపకరించే విధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
