ప్రపంచంలోనే అత్యధిక వయసున్న కతోలిక గురువుకు పోప్ అభినందనలు

జోసెఫ్ అవినాష్
07 Mar 2026
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కతోలిక గురువైన ఫాదర్ బ్రూనో కాంట్ గారు110వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విశ్వ కాపరి పోప్ లియో XIV ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియపరిచారు.జర్మనీలోని ఫుల్డా పీఠానికి చెందిన ఫాదర్ బ్రూనో కాంట్ 1950లో గురువుగా అభిషేకం పొందారు.అప్పటి నుండి దాదాపు 76 సంవత్సరాల పాటు దేవుని ప్రజలకు విశ్వాసపూర్వకంగా సేవ చేస్తూ జీవించారు.తన సందేశంలో పోప్ లియో XIV, ఆయన దీర్ఘకాలిక గురుత్వ సేవను ప్రశంసిస్తూ దేవుడు ఆయనకు ఆరోగ్యం,శాంతి మరియు ఆశీర్వాదాలు ప్రసాదించాలని ప్రార్థించారు.శతాబ్దం దాటిన జీవితంలో కూడా దేవుని పిలుపుకు నిబద్ధంగా నిలిచిన ఫాదర్ బ్రూనో కాంట్ జీవితం కతోలిక సంఘానికి గొప్ప సాక్ష్యంగా నిలుస్తోంది.
