నీవు ఎటువంటి కుమారుడువు?

జోసెఫ్ అవినాష్

06 Mar 2026

తప:కాల 2వ శనివారం
మీకా 7:14-15, 18-20
కీర్తన 103:1-2, 3-4, 9-10, 11-12
లూకా15:1-3, 11-32
ధ్యానం:
ఈ ఉపమానంలో ఇద్దరు కుమారుల మధ్య వ్యత్యాసాన్ని ప్రభువు చూపిస్తున్నారు. చిన్నవాడు తండ్రి నుంచి పొందినదంతా చెడు వ్యసనాలకు ఖర్చుచేసి,సర్వం పోగొట్టుకొని నీచమైన స్థితికి దిగజారుడు.తప్పు తెలుసుకొని తండ్రిని శరణు వేడి రక్షించబడినాడు.పెద్ద కుమారుడు తండ్రితో వ్యాజ్యానికి దిగాడు.చిన్న కుమారుడు తిరిగొచ్చినందుకు తండ్రి చేస్తున్న సంబరాలకు మండిపడి కనీసం ఇంట్లోకి పోడానికి కూడా నిరాకరించాడు.తనను బతిమాలుతున్న తండ్రితో నేను ఇన్ని సంవత్సరాలుగా నీ మాట వింటూ పనిపాట్లు చూసుకుంటున్నానే,నీ మాటను ఎప్పుడు మీరలేదే. ఎన్నడైనా నా మిత్రులతో విందు చేసుకోడానికి ఒక్క గొర్రెపిల్లనైనా ఇచ్చావా? అని ఎద్దేవా చేసాడు.అంటే తాను చేసే పనికి తగిన ప్రతి ఫలం తనకు దొరకలేదని,ఆస్తిని పంచుకొని నాశనం చేసే తగుదునమ్మా అని తిరోగొచ్చిన వాడికి విందులు వినోదాలు చేస్తున్నాడని తండ్రి తీరును తీర్పు తీరుస్తూ తమ్మునితో బేరీజు వేసుకున్నాడు.మనలో కూడా ఈ ఉపమానంలోని అన్నదమ్ముల మనస్తత్వాలు కలిగి ఉన్న వేరున్నారని ప్రభువు ఈ ఉపమానం చెప్పారు.మనకు అప్పగించబడిన పనిలో మనం విజయం సాధిస్తున్నామంటే అది మన విశ్వాసం ద్వారా, దేవుని వరం వలన మాత్రమే కానీ మన స్వయంకృతం కాదు. అది మనం చేసిన కృషికి ప్రతిఫలం కాదు.మనం గొప్పలు చెప్పుకోడానికి అక్కడ ఏది లేదు (ఎఫెసీ 2:8-9). ఒకటికన్నా మనం ఉన్నత క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడాని అర్హులం కాము పశ్చాత్తాపంతో పాపం నుండి వైదొలిగి దీనతతో తండ్రిని ఆశ్రయించి రక్షించబడిన చిన్న కుమారుని వలె వున్నామా? బేరీజులు వేసుకుంటూ పొరుగు వానికంటె హెచ్చించుకుంటూ ఇతార్థుల సంక్షేమాన్ని ఓర్చుకోలేని పెద్ద కుమారుని పోలి ఉన్నామా?

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN